Ads
ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నట్టుగా, ఓటీటీలలో వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. అలా వచ్చిన వెబ్ సిరీస్‌లలో ‘అయలీ’ ఒకటి. ఈ వెబ్ సిరీస్ తమిళంలో రూపొందింది.
Video Advertisement
ఈ తమిళ వెబ్ సిరీస్ జనవరి 26 నుండి ప్రముఖ ఓటీటీ ‘జీ5’ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. మరి అయాలీ స్టోరీ ఏమిటో? ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
అభి నక్షత్రం, అనుమోల్, మదన్ కీలకపాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్ కి ముత్తు కుమార్ దర్శకత్వం వహించారు. ఎనిమిది ఎపిసోడ్లగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, తమిళనాడులో ఉండే వీరపన్నై అనే ఊరి గ్రామ దేవత అయలీ. ఆ దేవతను రజస్వల కాని అమ్మాయిలు మాత్రమే దర్శించుకోవాలనే నియమం ఉంటుంది. ఆ ఊరి అమ్మాయిలకు రజస్వల అయిన వెంటనే పెళ్లి చేయాలని, అమ్మాయిలు అంతగా చదువుకోకూడదనే కట్టుబాట్లు ఉంటాయి.
అయితే ఈ కట్టుబాట్లు పాటించకుండా, ప్రేమించిన వ్యక్తితో ఒక అమ్మాయి పారిపోవడంతో దేవత ఆగ్రహించి ఆ ఊరిని నాశనం చేసిందనుకున్న ఆ గ్రామస్థులందరు వేరే ప్రాంతానికి వెళ్లిపోతారు. ఆ గ్రామస్థుల ఒక ఊరిని నిర్మించుకుని, అందులో అయలీ దేవత గుడిని నిర్మించి, తమ ఆచారాల్ని మళ్ళీ కొనసాగిస్తుంటారు. అయితే ఆ గ్రామాంలోని యళిల్ (అభి నక్షత్ర) డాక్టర్ కావాలని కలలు కంటుంది. ఆమె టెన్త్ క్లాస్ వరకు ఎలా చదువుకుంది? ఆమె కల నెరవేరిందా? లేదా? ఆమె ఊరి ప్రజల్లో ఎలా మార్పు తీసుకొచ్చింది? అనేది మిగిలిన కథ.
మొదటి నుంచే యళిల్ పాత్ర పై ఇంట్రెస్ట్ కలుగుతుంది. దానిని దర్శకుడు అలానే కొనసాగిస్తూ ఆమె పోరాటాన్ని తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. అభి నక్షత్ర యళిల్ క్యారెక్టర్ లో జీవించింది. స్టోరీని ఆ పాత్రే ముందుకు నడిపించింది. అనుమోల్, సింగంపులి, మదన్, టీఎస్ ధర్మరాజు, లింగా వంటివారు తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. రెవా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హత్తుకుంటుంది. రామ్‌జీ సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
Also Read: “రాశి ఖన్నా” కి ఏమయ్యింది..? తెలుగు సినిమాలకి ఎందుకు దూరం అయ్యారు..?
End of Article