Ads
దర్శకుడు గుణశేఖర్ కొంచెం కొత్తగా డిఫెరెంట్ గా ఆలోచిస్తూ వుంటారు. చారిత్రక నేపథ్యం లో వచ్చిన రుద్రమదేవి చిత్రం ని ఆయన చివరగా తీశారు. చాలా కాలం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత తో ‘శాకుంతలం’ సినిమాని ప్రకటించారు గుణశేఖర్. ఈ ట్రైలర్ కూడా వచ్చింది. మీరూ చూసే వుంటారు.
Video Advertisement
అడవిలో శకుంతల ఆశ్రమవాసం .. మరో వైపున రాజ్యంలో దుష్యంతుడి రాజరికం. ఇద్దరి పరిచయం .. ప్రేమ .. వివాహం .. విరహం .. దుర్వాసుడి శాపం.. భరతుడి జననం ఇవన్నీ కూడ ట్రైలర్ లో చూపించారు. కానీ పురాణాల్లో వున్న శాకుంతలం కథ ని ఇప్పుడు చూద్దాం.
కాళిదాసు అభిజ్ఞాన శకుంతలాన్ని రచించారు. ఎక్కువగా నవలలు కానీ టీవీలో కనపడే సీన్స్ లేదా సినిమాలు వంటివి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగానే తీస్తారు. రాస్తారు. ఓ నాడు విశ్వామిత్ర మహర్షి తపస్సు చేస్తూ ఉంటాడు. అది చూసి ఇంద్రుడు విశ్వామిత్ర మహర్షి ఇప్పటికే శక్తివంతుడు తపస్సు చేస్తే ఇంకాస్త శక్తివంతుడు అయిపోతాడని భయపడ్డాడు.
ఇంద్రుడు అందుకు ఆ తపస్సుకి భంగం కలిగించాలని మేనకని పంపుతాడు. మేనక ఆ తపస్సుని భంగం కలిగించింది. విశ్వామిత్రుడికి మేనక కి పుట్టిందే శకుంతల. మేనక ఈ పాపని మళ్లీ ఒక నదిలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ పాప కల్వ మహర్షికి దొరుకుతుంది. ఆయనే ఆ పాపకి శకుంతల అని పేరు పెట్టారు. ఆయన ఆశ్రమంలోనే శకుంతల పెరిగింది. అంతా బాగానే ఉందనుకునేసరికి దుష్యంత మహారాజు కల్వ మహర్షి ఆతిథ్యము కోసం వస్తాడు.
మహారాజు లేరని శకుంతల చెబుతుంది. శకుంతల అందాన్ని చూసి దుష్యంత మహారాజు ఆమెతో ప్రేమలో పడతాడు. మళ్లీ కొన్ని రోజులకి వస్తానని చెప్పి మహారాజు వెళ్లిపోతాడు. శకుంతల కూడా అతనితో ప్రేమలో పడుతుంది. అయితే దుష్యంత మహారాజు పెళ్లి చేసుకోమని అడుగుతాడు. కల్వ మహర్షి లేకుండానే శకుంతలని పెళ్లి చేసుకుంటాడు. కల్వ మహర్షి తిరిగి వచ్చిన తర్వాత చేసినది మంచి పని అని చెబుతాడు అయితే పెళ్లి చేసుకున్న దుష్యంతుడు శకుంతలని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తున్నా కూడా రాడు.
ఒకరోజు దుర్వాస మహర్షి ఆశ్రమానికి వస్తాడు. శకుంతల వినిపించుకోదు. దీంతో కోపం వచ్చి నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో వాళ్లు నిన్ను మర్చిపోతారు అని శపిస్తాడు. ఈ విషయాన్నికల్వ మహర్షికి చెప్తుంది శకుంతల. అప్పుడు మహర్షి ని భర్తకి సంబంధించిన వస్తువు ఏదైనా అతనికి చూపిస్తే నిన్ను గుర్తుపడతాడని చెబుతారు. మరోవైపు శకుంతల గర్భిణీ. మహారాజు నీ భర్త దగ్గరికి వెల్దాము ఆని ఒక ఉంగరాన్ని ఇస్తాడు. అయితే వీళ్ళు వెళ్తున్నప్పుడు దారిలో ఆ ఉంగరం పడిపోతుంది.
శకుంతల దుష్యంత మహారాజు దగ్గరికి వెళ్తే ఆయన గుర్తుపట్టడు సరి కదా అనరాని మాటలు అంటాడు. దాంతో శకుంతల బాధపడి వెనక్కి వెళ్ళిపోతుంది. ఒకరోజు ఓ మత్స్యకారుడికి ఉంగరం దొరికితే దాన్ని తీసుకుని దుష్యంత మహారాజు దగ్గరికి వెళ్తాడు. దుష్యంత మహారాజు కి అంతా గుర్తు వచ్చి ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. అలా వెళ్తున్న సమయంలో ఒక బాబు కనపడతాడు. ఆ బాబు పులులు సింహాలతో ఆడుకుంటూ ఉంటాడు.
ఆ బాబు శకుంతల దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ బాబు ఎవరో కాదు శకుంతల దుష్యంత మహారాజు కొడుకు భరత్. ఆ భరత్ వల్లే మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. ఇంకో దాని ప్రకారం అయితే అవమానం జరిగిన శకుంతలని తర్వాత తన తల్లి వచ్చి ఆమెను తీసుకువెళ్లిపోతుంది. అప్పుడు దుష్యంత మహారాజు యుద్ధం చేసి శకుంతలని భరత్ ని పొందుతాడు.
End of Article