“జై శ్రీరామ్” అంటూ షారుఖ్ ఖాన్…నిజమైన కింగ్ నువ్వే అంటున్న ఫ్యాన్స్.! అసలేమైంది?

“జై శ్రీరామ్” అంటూ షారుఖ్ ఖాన్…నిజమైన కింగ్ నువ్వే అంటున్న ఫ్యాన్స్.! అసలేమైంది?

by Mounika Singaluri

Ads

సినిమా నేపథ్యం లేకుండా స్టార్ హీరోలు కానీ, హీరోయిన్లు కానీ అవ్వడం చాలా కష్టం. కొంత మంది మాత్రం అలాంటి కష్టాలు అన్నిటిని అధిగమించి, పెద్ద స్టార్లు అవుతారు. తెలుగు ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం సెల్ఫ్ మేడ్ హీరోలు అంటే గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరు.

Video Advertisement

ఒకరు అమితాబ్ బచ్చన్ అయితే, మరొకరు షారుఖ్ ఖాన్. అమితాబ్ బచ్చన్ లెజెండ్. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. షారుఖ్ ఖాన్ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. అవన్నీ ఆయన అభిమానులకి, ఆయన సినిమా కెరీర్ మొదటి నుండి ఇప్పటి వరకు చూస్తున్న వారందరికీ కూడా తెలుసు. 2 సంవత్సరాల క్రితం వరకు షారుఖ్ ఖాన్ కి సరైన హిట్ లేదు.

shah rukh khan at ambani pre wedding festivities

కానీ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. ఫ్లాప్స్ వచ్చినా కూడా షారుఖ్ ఖాన్ అభిమానులు ఆయనని నమ్మారు. అదే నమ్మకాన్ని నిజం చేశారు. షారుఖ్ ఖాన్ సినిమాల్లో మాత్రమే కాకుండా, బయట ఈవెంట్స్ లో కూడా పాల్గొని తనదైన స్టైల్ లో ఎంటర్టైన్ చేస్తారు. షారుఖ్ ఖాన్ ఉన్నారు అంటే అందరి కళ్ళు ఆయన మీదే ఉంటాయి. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి ముందు జరిగిన వేడుకల్లో కూడా షారుఖ్ ఖాన్ పాల్గొన్నారు. చాలా హుషారుగా డాన్స్ కూడా చేశారు. అయితే షారుక్ ఖాన్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు, “జై శ్రీరామ్. దేవుడు అందరిని ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు చాలా మంది డాన్స్ చేయడం చూశారు. కానీ ప్రార్థనలు లేకపోతే ఇంత మంచి విశేషం ముందుకి సాగదు.”

shah rukh khan at ambani pre wedding festivities

“అందుకే, ఈ కుటుంబం యొక్క సరస్వతి, లక్ష్మి, పార్వతీ దేవిని మీ అందరికీ పరిచయం చేయాలి అని అనుకుంటున్నాను. శ్రీమతి కోకిలా బేన్ అంబానీ, పూర్ణిమ దలాల్, దేవయాని ఖిమ్జీ లని స్టేజ్ మీదకి రావాలి అని కోరుకుంటున్నాను” అంటూ షారుఖ్ ఖాన్ స్పీచ్ చెప్పారు. నాటు నాటు పాటకి కూడా సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తో కలిసి షారుఖ్ ఖాన్ డాన్స్ చేశారు. ఈవెంట్ మొత్తంలో తనదైన స్టైల్ లో సందడి చేశారు. అయితే షారుఖ్ ఖాన్ స్టేజ్ మీద జైశ్రీరామ్ అనడం చూసిన వాళ్ళందరూ కూడా షారుఖ్ ఖాన్ ని మెచ్చుకుంటున్నారు. కులమతాలకు అతీతంగా దైవాన్ని ప్రార్థిస్తారు అని, అన్ని ధర్మాలకి గౌరవం ఇస్తారు అని అన్నారు. “షారుఖ్ ఖాన్ నిజమైన కింగ్” అని అంటున్నారు.

watch video :

ALSO READ : తెలుగు ఇండస్ట్రీ మొదటి హీరో “కళ్యాణం రఘురామయ్య” కుటుంబం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారో తెలుసా..?


End of Article

You may also like