కొన్నేళ్ల నుండి షారుఖ్ ఖాన్ ట్రాక్ రికార్డు బాలేదు. ఒకపుడు మంచి హిట్స్ ని అందుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం షారుఖ్ ఖాన్ సరైన సినిమాల కోసం అవస్థలు పడుతున్నాడు. సినిమాలు వచ్చినవి వచ్చినట్టే హిట్ అందుకోకుండా డిజాస్టర్స్ గానే మిగిలిపోతున్నాయి. షారుఖ్ నటించి ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమా మంచి సక్సెస్ ని ఇచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ఫ్లాప్ లు గా మిగిలిపోయాయి.

Video Advertisement

ఇప్పుడు పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి షారుఖ్ రాగా.. చిత్రాని కి మొదట నుండి కూడా
సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా వివరాల లోకి వస్తే…

pathaan movie review

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. జనవరి 25న రిపబ్లిక్ డే కానుకగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. దీపికా పదేకొణె హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ లో జాన్ అబ్రహం కీలక పాత్ర చేసారు. ప్రపంచవ్యాప్తంగా 7700 స్క్రీన్స్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ మొదటి రోజు ఏకంగా రూ. 55 కోట్ల రేంజ్‌లో నెట్ కలెక్షన్స్‌ను కలెక్ట్ చేసేసింది. దాదాపు రూ. 250 నుండి 260 కోట్లు బిజినెస్ జరిగింది. 38 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 530.09 కోట్లు నెట్‌, రూ. 1029 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది ఈ సినిమా.

pathaan movie review

39వ రోజు రూ. 3.50 కోట్లు గ్రాస్, రూ. 2 కోట్లు వరకూ నెట్ రాబట్టింది. 39 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 532.00 కోట్లు నెట్ వచ్చింది. రూ. 1032 కోట్లు వరకూ గ్రాస్ వచ్చింది. అలానే 39 రోజుల్లో ఓవర్సీస్‌ లో 47.10 మిలియన్ డాలర్లు (386.70 కోట్లు) వసూల్ చేసింది ఈ సినిమా. 39 వ రోజు రూ. 2 కోట్లుకు పైగా నెట్‌ వచ్చింది. ఇప్పటి దాకా ఈ సినిమా రూ. 270 కోట్లకు పైగా లాభాలను పొందింది. రూ. 260 కోట్లు టార్గెట్‌ తో సినిమాని రిలీజ్ చేసారు.