రామ్ చరణ్ ని అందరి ముందు షారుఖ్ ఖాన్ ఇలా అవమానించారా..? అసలు ఏం జరిగిందంటే..?

రామ్ చరణ్ ని అందరి ముందు షారుఖ్ ఖాన్ ఇలా అవమానించారా..? అసలు ఏం జరిగిందంటే..?

by Mounika Singaluri

Ads

భారత కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి ప్రముఖులందరూ హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మన రామ్ చరణ్ దంపతులకు కూడా ఆహ్వానం అందింది. అయితే సతీ సమేతంగా ఆ కార్యక్రమానికి వెళ్ళిన రామ్ చరణ్ కి అక్కడ అవమానం జరిగిందంటూ ఆయన మేకప్ ఆర్టిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

Video Advertisement

ఇంతకీ ఏం జరిగిందంటే అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కి బాలీవుడ్ సౌత్ సినిమా స్టార్స్ అందరూ హాజరయ్యారు ఈ వేడుకలో బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ కలిసి స్టేజి మీద ఆస్కార్ అవార్డు పాట నాటు నాటుకి స్టెప్పులు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే షారుక్ చరణ్ ని ఇడ్లీ వడ చరణ్ స్టేజ్ మీదకి రావాలని అన్నాడు.

shah rukh khan ram charan incident

దీంతో చాలా అవమానంగా ఫీల్ అయ్యారంట చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్. సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలా పిలవటం అవమానంగా అనిపించి తాను కార్యక్రమం మధ్యలోనే బయటికి వచ్చేసాను అని చెప్పి సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జరిగిన విషయాన్ని రాసుకొచ్చారు. అయితే ఈ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవ్వటంతో చాలామంది టాలీవుడ్ అభిమానులు బాలీవుడ్ పై షారుక్ ఖాన్ ఫైర్ అవుతున్నారు.

షారుక్ ఖాన్ కి ఇంకా టాలీవుడ్ పై చులకన భావం ఉంది అంటూ అతనిపై మండిపడుతున్నారు. షారుక్ సరదాగానే పిలిచినప్పటికీ అంత పెద్ద స్టార్ హీరోని అంతమంది ముందు అలా అవమానించడం తగదు అని కొందరు నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ సినిమా అంటే అందరూ టాలీవుడ్ పేరు నే చెబుతున్నారు మీ బాలీవుడ్ రేంజ్ ఎప్పుడో పడిపోయిందని విమర్శిస్తున్నారు


End of Article

You may also like