Ads
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ (52) కన్నుమూశారు. షేన్ తన విల్లాలో అచేతనమైన స్థితిలో ఉన్నారు. వైద్య సిబ్బంది వచ్చి చికిత్స చేసినా కూడా షేన్ స్పందించలేదు.
Video Advertisement
షేన్ కుటుంబం మాట్లాడుతు వారికి ప్రైవసీ కావాలి అని, వారు ఇప్పుడు ఈ వార్తపై మాట్లాడే స్థితిలో లేరు అని చెప్పారు. ఈ వార్తతో క్రికెట్ లోకం మొత్తం దిగ్బ్రాంతికి గురయ్యింది. ఈ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో నెటిజెన్లతో పాటు పలువురు ప్రముఖులు కూడా షేన్ ఆత్మకి శాంతి కలగాలి అని సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు.
షేన్ వార్న్ 708 టెస్ట్ మ్యాచ్ వికెట్లతో ఆల్ టైమ్ అత్యుత్తమ లెగ్ స్పిన్నర్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. షేన్ వార్న్ 293 వన్డే ఇంటర్నేషనల్ వికెట్లు తీసి రికార్డ్ సాధించారు, ఆస్ట్రేలియా తరపున అన్ని ఫార్మాట్లలో 300 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడారు.
End of Article