మొదటి నాలుగు బిగ్ బాస్ సీజన్స్ కూడా ప్రేక్షకుల్ని బాగా అలరించడం వలన ఈ సీజన్ పై కూడా అంచనాలు భారీగానే పెరిగాయి. ఈ సీజన్లో కూడా కంటెస్టెంట్లు తెగ సందడి చేశారు. 19 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా టైటిల్ ఫేవరెట్ గా షణ్ముఖ్ జస్వంత్ పేరు వినిపించింది.
అయితే టైటిల్ మాత్రం సన్నీ గెలుచుకున్నాడు. 3వ రన్నరప్ గా శ్రీ రామ చంద్ర నిలవగా, 2వ రన్నరప్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచారు. షో అయిపోయాక, బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ 2 నెలల్లో ప్రారంభమవుతుంది అని చెప్పారు. ఆ సీజన్ ఓటీటీలో ప్రసారం అవుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
షణ్ముఖ్ హౌజ్ నుండి బయటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో మాట్లాడారు. నెటిజన్లలో చాలా మంది, దీప్తి సునైనా గురించి అడుగుతున్నారు. దాంతో షన్ను, “మా ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు కామనే. లైవ్ లో యాడ్ చేద్దామంటే నన్ను బ్లాక్ చేసింది. నాకు కోపం వస్తే అలుగుతాను. తను కోపం వస్తే అరవదు. బ్లాక్ చేస్తుంది. తను ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉందో తెలియదు. నేనే వెళ్లి కలుస్తాను. ఫ్యాన్స్ ఎవరు వర్రీ కావొద్దు. మా ఇద్దరికీ ఏమి అవ్వదు. నేను దీపుని వదిలిపెట్టను. ఎవరు టెన్షన్ పడకండి” అని చెప్పారు.
watch video :