సినిమా స్టోరీ కంటే ఆసక్తిగా ఉన్న షర్మిల లవ్ స్టోరీ..

సినిమా స్టోరీ కంటే ఆసక్తిగా ఉన్న షర్మిల లవ్ స్టోరీ..

by Mounika Singaluri

Ads

ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బాగా సుపరిచితురాలు. ఇంతకుముందు జగన్ తరఫున ప్రచారం చేపట్టి పాదయాత్ర నిర్వహించిన షర్మిల అతను సీఎం అయిన తర్వాత తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి హైదరాబాద్ కి పరిమితమయ్యారు. ఆమె గురించి రాజకీయంగా మనకు ఎన్నో తెలుసు కానీ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలు మనలో ఎవరికీ తెలియవు.

Video Advertisement

ys-sharmila-fires-on-cm-kcr

రాజకీయాలలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది అనుకునే షర్మిల లైఫ్లో ఓ మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా ఉంది అన్న విషయం మీకు తెలుసా? బ్రదర్ అనిల్ కుమార్ ని షర్మిల ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. చదువుకునే రోజుల్లో ఒకసారి హైదరాబాదులోని ఒక డాబాకు షర్మిల ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళింది. అక్కడే ఆమె బ్రదర్ అనిల్ కుమార్ ని కలుసుకుంది.

 

ఇక ఆ తర్వాత వాళ్లు అప్పుడప్పుడు కలుస్తూ వచ్చారు.. ఈ నేపథ్యంలో ఇద్దరు మధ్య  స్నేహం ప్రేమగా మారడంతో అనిల్ కుమార్ షర్మిలకు ప్రపోజ్ చేశారట. అయితే ఇంకా అప్పటికి అతను క్రైస్తవ మతంలోకి మారలేదు.. అనిల్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో.. రాజశేఖర్ రెడ్డి ఈ పెళ్లికి మొదట్లో అంగీకరించలేదు. ఇరు కుటుంబాల పద్ధతులు అలవాట్లు ఆచారాలు పూర్తిగా భిన్నంగా ఉండడంతో.. అక్కడ షర్మిల ఇమడలేదు అని భావించిన రాజశేఖర్ రెడ్డి ఆమెకు నచ్చ చెప్పారు.

 

అయినా సరే షర్మిల అనిల్ మీద ఉన్న నమ్మకంతో.. ఎటువంటి పరిస్థితులైన తట్టుకొని నిలబడతాను ఈ వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. షర్మిల నాన్ వెజ్ తినడం పై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అనిల్ చెప్పారని.. తన జీవితం ఎప్పుడూ సంతోషంగానే ఉందని షర్మిల ఈ సందర్భంగా తెలియజేసింది. అని తన రాజకీయ జీవితానికి ఎంతో చేదోడువాదోడుగా నిలబడడమే కాకుండా అనుక్షణం తనకు సపోర్ట్ ఇస్తూ వచ్చారని షర్మిల చెప్పుకొచ్చారు.


End of Article

You may also like