బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా హిట్ అందుకుంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. మంచి వినోదాన్ని కూడా అందించింది అఖండ. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం సినిమాకి ప్లస్ అయ్యింది. ప్రేక్షకుల్ని ద్విపాత్రాభినయం ఎంతగానో మెప్పించింది.

Video Advertisement

అయితే హిట్ అయిన ఈ సినిమాలో బాలకృష్ణ తల్లిగా నటించిన ఆమె ఎవరు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. అఖండ చిత్రంలో బాలకృష్ణ తల్లి పాత్ర చేసింది విజి చంద్రశేఖర్.

ఈమె గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. విజి చంద్రశేఖర్ భర్త ఎయిర్ ఇండియాలో సీనియర్ రిటైర్డ్ కెప్టెన్. అయితే ఆయన రిటైర్ అయినప్పటికీ కూడా ఇంకా ఎయిర్ ఇండియా లోనే పని చేస్తున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయాలను చంద్రశేఖర్ చెప్పారు. ఈమె ఎక్కువ సమయాన్ని కుటుంబంతోనే గడుపుతారు. అలానే కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తారు.

అందుకోసమే కేవలం నెలలో 12 రోజులు మాత్రమే పని చేస్తానని చెప్పారు. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు. వీరిలో ఒకరు డాక్టర్. మరొకరు యాక్టర్. అయితే ఈమె భర్త కెప్టెన్ అవ్వడం వలన ఎక్కువగా ఇంటికి వచ్చేవారు కాదని… అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వచ్చే వారని.. దీంతో పిల్లల బాధ్యత పూర్తిగా ఈమే చూసుకోవాల్సి వచ్చేదని ఈమె చెప్పారు.

చిన్నప్పటి నుండి పిల్లల్ని సక్రమంగా ఈమె నడిపిస్తూ వచ్చారు. అదే విధంగా పిల్లలకు సంబంధించిన ఫంక్షన్స్ ని కూడా ఈమే నిర్వహించే వారు అని చెప్పారు. నిజానికి సినిమాల కంటే కూడా కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చే దానిని అని విజి చంద్రశేఖర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

Akhanda Movie: అఖండ సినిమాలో బాలకృష్ణ తల్లి పాత్రలో నటించిన ఆమె ఎవరో తెలుసా?