Ads
తెలుగు సినీ ఇండస్ట్రీకి సుపరిచితమైన శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి వంటి స్టార్ హీరో డాన్స్ చూసి డాన్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్న శేఖర్ మాస్టర్ తన పట్టుదలతో చివరికి చిరంజీవికే కొరియోగ్రాఫర్ గా చేసే స్థాయికి ఎదగలిగారు. ఎన్నో పెద్ద మూవీస్ కి స్టార్ హీరోలకి కొరియోగ్రాఫర్ గా పనిచేసారు.
Video Advertisement
ప్రస్తుతం శేఖర్ మాస్టర్ టాలీవుడ్ లో బెస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరుగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా బుల్లితెరపై ఎన్నో షోలకు జడ్జిగా చేసి అందరి మన్ననలు పొందారు. అప్పుడప్పుడు తండ్రి తో కలిసి షోలకు హాజరయ్యాయి ఆయన కూతురు సాహితి గురించి అందరికీ తెలిసిందే. గతంలో బుల్లితెరపై ఒక టీవీ షోలో పాటిస్పేట్ చేసిన సాహితి తన డాన్స్ ప్రతిభతో ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించింది. ఈ డాన్స్ షో పుణ్యమా అని శేఖర్ మాస్టర్ కూతురు సాహితి గురించి చాలామందికి తెలిసింది.
సోషల్ మీడియాలో కూడా తన డాన్స్ వీడియోలతో సందడి చేసే సాహితి ఎంతోమంది ఫాన్స్ ను ఆకట్టుకుంది. అసలు ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలో సాహితి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ సాహితీలను ఓ కొత్త దర్శకుడు మంచి కథతో అప్రోచ్ అయినట్టు తెలిసింది. ఇక ఆ కథ విపరీతంగా నచ్చడంతో శేఖర్ మాస్టర్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. కొత్త డైరెక్టర్ తో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోతో ఈ మూవీ ఏ మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. పైగా శేఖర్ మాస్టర్ సినీ ఇండస్ట్రీలో తనకు ఉన్న పరపతిని పరిచయాలను పూర్తిగా ఉపయోగించి మరి హీరోని అన్వేషించడంలో బిజీగా ఉన్నారని ప్రచారాలు జరుగుతున్నాయి. తన డాన్స్ తో క్యూట్ లుక్స్ తో సోషల్ మీడియాలో ఒక సంచలనాన్ని రేపిన సాహితి హీరోయిన్ గా రాణించాలి అని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
End of Article