ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇటీవల ఒక కేసు విషయంలో అరెస్టయ్యారు. అయితే శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఎన్నో సంవత్సరాలు ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ శిల్పా శెట్టి పర్ఫ్యూమ్ అయిన s2 బ్రాండ్ ప్రమోషన్ లో కలిశారు. ముందు వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు. తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది.

Video Advertisement

Shilpa Shetty Raj Kundra love story

అయితే అప్పటికి రాజ్ కుంద్రా కి పెళ్లి అయి ఉంది. శిల్ప శెట్టి తో పరిచయం అయినప్పుడు రాజ్ కుంద్రా తన వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యల్లో ఉన్నారు. తర్వాత రాజ్ కుంద్రా విడాకులు తీసుకున్నారు. శిల్పా శెట్టిని ఇంప్రెస్ చేయడానికి విలువైన బహుమతులు పంపించారు. వర్సాచే అనే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ కి చెందిన ఒకటే మోడల్ కి చెందిన మూడు రంగుల బాగ్ లని  శిల్పా శెట్టికి బహుమతిగా పంపించారు రాజ్ కుంద్రా.

Shilpa Shetty Raj Kundra love story

ఆ తర్వాత శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా కొన్ని సంవత్సరాలు డేట్ చేశారు. ఇది మాత్రమే కాకుండా ఒక ఖరీదైన 5 క్యారెట్ల ఉంగరంతో శిల్పా శెట్టికి ప్రపోజ్ చేశారు రాజ్ కుంద్రా. అలా వీరిద్దరూ 2009 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. అయితే వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు రాజ్ కుంద్రా మొదటి భార్య కవిత, శిల్పా శెట్టిపై ఆరోపణలు చేశారు. శిల్ప వల్ల తన భర్త తనని అలాగే తన, బిడ్డని వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పారు.

Shilpa Shetty Raj Kundra love story

కానీ తర్వాత శిల్పా శెట్టి, అప్పటికి తనకు, రాజ్ కుంద్రాకి కేవలం మూడు నెలల పరిచయం మాత్రమే ఉంది అని, తన వల్ల వాళ్ళిద్దరు విడిపోవడం లాంటిది ఏదీ జరగలేదు అని అన్నారు. రాజ్ కుంద్రా కూడా తన విడాకులకి శిల్పా శెట్టికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత శిల్పా శెట్టి తాను జడ్జిగా వ్యవహరిస్తున్న సూపర్ డాన్సర్ షోలో నుండి బయటికి వచ్చేశారు. ప్రస్తుతం శిల్పా శెట్టి స్థానంలో కరిష్మా కపూర్ జడ్జి గా వ్యవహరిస్తున్నారు.