కెరీర్ ఫెయిల్ అవ్వడానికి కారణం చెప్పిన శివారెడ్డి…ఆ యాక్టర్ నన్ను టార్గెట్ చేసి తొక్కేసాడు.!

కెరీర్ ఫెయిల్ అవ్వడానికి కారణం చెప్పిన శివారెడ్డి…ఆ యాక్టర్ నన్ను టార్గెట్ చేసి తొక్కేసాడు.!

by Anudeep

Ads

“శివారెడ్డి” పేరు గుర్తు రాగానే తెలుగు సినిమా నటుల, రాజకీయ నాయకుల వాయిస్లు అలా గుర్తొచ్చేస్తుంటాయి. మిమిక్రిలో ఆరితేరిన కళకారుడు. తన మిమిక్రితో కొన్ని వేలమందిని నవ్వించిన వాడు . కొన్నాళ్ల పాటు తెలుగు సినిమాల్లో నటించి అలరించినవాడు . మెగాస్టార్ లాంటి వాళ్లే తన టాలెంట్ ని పొగిడారంటే తన ప్రతిభ ఏంటో అర్దం చేసుకోవచ్చు.  “అతడే ఒక సైన్యం”, “ దూకుడు” సినిమాల్లో శివారెడ్డి నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఒకట్రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు.

Video Advertisement

వందకి పైగా చిత్రాల్లో హీరో ఫ్రెండ్ గా, కమెడియన్ గా కనిపంచిన శివారెడ్డి కొంత కాలంగా వెండితెరపైన  కనపడడంలేదు, కనీసం బుల్లి తెర పై ఏమన్నా నటిస్తున్నాడా అంటే అది లేదు. ఇన్ని రకాల టివి షోస్ వస్తున్నాయి వేటిల్లో కూడా కనపడక దాదాపు ఏళ్లు అవుతోంది. మరింతకి శివారెడ్డి ఏమైనట్టు, ఏమైనా ఆరోగ్య సమస్యలా? ఇలా ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి కదా..ఈ ప్రశ్నలకి సమాధానాలు రాబట్టడానికే ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రయత్నించి శివారెడ్డిని సంప్రదించి ఎందుకు సినిమాల్లో నటించట్లేదని ప్రశ్నించింది.

టీవీ9 కథనం ప్రకారం…“నటించాలని నాకు మాత్రం ఉండదా అండీ, కాని అవకాశాలు రావట్లేదు. బయట కనిపించినప్పుడు చాలామంది అడుగుతుంటారు, ఎందుకు నటించట్లేదు , నటించండి అని, కానీ అవకాశాలిచ్చేవాళ్లకి నేను అవసరం లేనప్పుడు నేను వెళ్లి అవకాశాలివ్వండి అంటూ చేయి చాచలేను కదా” అంటూ సమాధానం ఇచ్చారు.

అంతేకాదు ఇప్పటివరకు నేనెలాంటి చెడ్డపనులు చేయలేదు, ఎవరితో చెడుగా ప్రవర్తించింది లేదు అయినా కూడా నన్నెందుకు దూరం పెట్టారో నాకు అర్దం కావడంలేదు. ఇండస్ట్రీలో క్యారెక్డర్ బాగోకపోయినా , టాలెంట్ లేకపోయినా నిలదొక్కుకున్నవళ్లున్నారు. క్యారెక్టర్ బాగోకపోయినా టాలెంట్ ఉన్నవాళ్లు ఉన్నవాళ్లు ఉంటున్నారు. టాలెంట్ ఉండి, కారెక్టర్ పరంగా ఎలాంటి బాడ్ రిమార్క్స్ లేని నాకు మాత్రం అవకాశాలు ఇవ్వడం లేదు. అవకాశాల కోసం నేను ఎవరిని గోకలేను , అది నా నైజం కాదు అని చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో ఎవరెవరు తనను , తన టాలెంట్ ని గుర్తించి , ఎలా అభినందించారో తలుచుకుంటూ “ శివారెడ్డిది మామూలు టాలెంట్ కాదు, ఇంకా ఇంకా ఎత్తుకి ఎదగాల్సిన ఆర్టిస్ట్ అని స్వయంగా చిరంజీవి గారే ఒకసారి స్టేజిపై పొగిడారు. ఒకసినిమా చూసాక ప్రకాశ్ రాజ్ కాల్ చేసి చింపేసావ్ అని అన్నారు. దాసరి నారాయణరావు గారుకూడా తన అభిమానాన్ని తెలియచేశారు. ఎలాంటి టాలెంట్ లేకుండా ఇంతమంది అభిమానాన్ని దక్కించుకోవడం సాధ్యమా అని ప్రశ్నించారు.

ఇండస్ట్రీలో ఒక హీరో మీకు అవకాశాలు రాకుండా చేశారనే వార్తలొస్తున్నాయి వాటిల్లో నిజమెంత అని ప్రశ్నిస్తే, అందులో వాస్తవం లేకపోలేదు. ఆ యాక్టర్ వల్లే నాకు అవకాశాలు రావడం లేదు అనేది నిజం  అంటూ ఆ యాక్టర్ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఇకముందు చెప్పబోనని అన్నారు. ప్రస్తుతం మిమిక్రీ షోలు చేసుకుంటూ బతుకుతున్నాను. వేల మంది ముందు లైవ్లో షో చేసే నాకు, దర్శకుడు చెప్పింది నటించే టాలెంట్ ఉండదా, కాబట్టి టాలెంట్ లేదు అనేది అవాస్తవం, కావాలనే అవకాశాలు ఇవ్వట్లేదనేది నిజం అంటూ నర్మగర్భంగా చెప్పుకొచ్చారు శివారెడ్డి.


End of Article

You may also like