Ads
క్రికెట్ క్లబ్స్ లో అతి రిచెస్ట్ క్లబ్ గా కొనసాగుతున్న బీసీసీఐ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపిఎల్ ఈసారి భారత్ లో ఉన్న కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని యూఏఈలో జరపాలని నిర్ణయించింది. ఈ సంవత్సరం మొదట్లో T20 కప్ ను దృష్టిలో ఉంచుకొని చాలామంది ఫారెన్ ప్లేయర్స్ ఐపీఎల్ లో పాల్గొనమని ప్రకటించారు. తాజాగా ఐసీసీ T20cup వాయిదా వేయడంతో ఐపీఎల్ కు మార్గం సుగమమైంది.
Video Advertisement
అయితే ఈ విషయంపై తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. బీసీసీఐ ఈసారి ఐపీఎల్ విజయవంతంగా ఎప్పటిలాగే నిర్వహించాలని టీ20 కప్ ను కావాలనే వాయిదా పడేలా చేసిందని ఇలా చేయడానికి కావలసిన పవర్ మరియు డబ్బు బీసీసీఐ దగ్గర ఉన్నాయని షోయబ్ అక్తర్ బీసీసీఐను విమర్శించాడు.
భారత్ పై ఉగ్రవాదులను ఎగదోస్తునందుకు పాకిస్తాన్ తో అన్ని రకాల సంబంధాలను భారత ప్రభుత్వం తెంచుకుంది.అందులో భాగంగా దాదాపు దశాబ్ద కాలం నుండి బీసీసీఐ పాకిస్థాన్ తో ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్ లను నిర్వహించలేదు.దీనితో పిసిబి పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోయింది.
దీనివల్ల పాకిస్థాన్ క్రికెట్ ఆఖరి అంకానికి చేరింది.అందుకే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ లందరూ సమయం దొరికినప్పుడల్లా భారత్ పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. గతంలో కూడా పాకిస్థాన్ మాజీ క్రికెట్ ప్లేయర్స్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పై స్పందించాల్సిన అవసరం లేదు లైట్ తీసుకుంటే సరిపోతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
End of Article