పెళ్లంటే నూరేళ్ల పంట. కాని ఈ పంట కొన్ని జీవితాల్లో మంటలు పుట్టిస్తుంది. విచిత్ర కారణాలవల్ల ఆ జంటలు విడాకుల వరకు వెళుతున్నాయి. ఇందులో విడాకులకు అప్లై చేసి ఎదురు చూసే సమయంలో వారికి పుట్టిన పిల్లలు కూడా పెరిగి పెద్దవారవుతున్నారు.అలాంటి ఘటనలు కూడా ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి ఓ సంఘటన ఈ భార్య భర్తల విషయంలో జరిగింది. అదేంటో తెలుసుకుందాం..!

Video Advertisement

ఇద్దరు భార్యాభర్తలకు 1988 లోనే పెళ్లి జరిగింది. వారికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అలా 14 సంవత్సరాలు వాళ్ళ వివాహ జీవితం బాగానే సాగింది. తర్వాత విభేదాలు మొదలయ్యాయి. దీంతో తన భర్త 2002లో విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాడు. కానీ భార్య దీనికి ఒప్పుకోలేదు. తన భర్త నుంచి విడిపోయి నేను బతకలేనని భావిస్తోంది. అంతేకాకుండా తన కొడుకును కూడా కలవనివ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది ఆ మహిళ. దీంతో కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. ఆ తల్లితో మాట్లాడాలని కొడుకుకు చెప్పింది.

కోర్టు విజ్ఞప్తిని తిరస్కరించిన తన 27 సంవత్సరాల కొడుకు తల్లి గురించి విస్తుపోయే నిజాలు చెప్పారు. తల్లి పెట్టినటువంటి టార్చర్ వల్లనే భరించలేకే మా నాన్నతో ఉంటున్నానని, నాకు ఏడేళ్ళ వయస్సు ఉన్నప్పుడే మా అమ్మ నన్ను బాగా కొడుతూ ఉండేదని, ఆమె బయటకు వెళ్ళినప్పుడు బాత్రూం లో ఉంచి తలుపు వేసేది అని అలా నేను గంటలకొద్దీ బాత్ రూమ్ లోనే ఉండి పోయేవాడినని అన్నాడు. అందుకే ఆమెతో మాట్లాడటం నాకు ఇష్టం లేదని కొడుకు కోర్టు ముందు చెప్పాడు. దీంతో భర్త కొడుకు తో నాటకం ఆడిస్తున్నాడని, ఆ మాటలు పరిగణలోకి తీసుకోవద్దని భార్య తరపు న్యాయవాది వాదించారు. దీంతో ఇరు వాదనలు విన్న ధర్మాసనం రెండు రోజుల తర్వాత మాట్లాడదామని కేసును వాయిదా వేసింది.