సైంధవ్ సినిమా హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా.? చదువుకున్నది హైదరాబాద్ లోనే.!

సైంధవ్ సినిమా హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా.? చదువుకున్నది హైదరాబాద్ లోనే.!

by Mounika Singaluri

హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ తెలుగులో అందరికీ సుపరిచితురాలు. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. తాజాగా విక్టరీ వెంకటేష్ సరసన ఆయన 75వ సినిమా సైంధవ్ లో నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే శ్రద్ధ శ్రీనాథ్ అందరూ తెలుగు అమ్మాయి అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు.

Video Advertisement

ఒకసారి శ్రద్ధ బ్యాక్ గ్రౌండ్ గురించి చూస్తే… ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ పుట్టింది ఆమె తల్లిదండ్రులు ఏం చేస్తారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రద్ధ శ్రీనాథ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్ లో జన్మించింది. ఈమె తండ్రి ఆర్మీలో పని చేయడం వల్ల చాలా రాష్ట్రాల్లో నివసించింది.

ఏడు నుండి పదవ తరగతి వరకు సికింద్రాబాద్ లో చదువుకుంది. బెంగళూరులో ఎల్ఎల్బి చదివింది.తర్వాత కార్పొరేట్ లాయర్ గా పనిచేసింది. సినిమాలపై ఉన్న ఆసక్తితో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంది.మలయాళీ సినిమా కోహినూర్ తో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. తర్వాత వరుస పెట్టి తెలుగు తమిళ్ కన్నడ భాషలో సినిమాలు చేస్తూ వచ్చింది.

తెలుగులో శ్రద్ధ మొదలు సినిమా జెర్సీ. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత జోడి, కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాల్లో కూడా నటించింది. తన తిరిగి వెళ్లల్లో చెన్నైలో వీళ్ళకి ఉన్న వ్యాపార నిర్వహణలు చూసుకుంటుంది. ఎప్పటికైనా మణిరత్నం ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలనేది శ్రద్ధ శ్రీనాథ్ కలగా చెప్పుకొచ్చింది. తనకి ఇష్టమైన నటులు మమ్ముట్టి, హృతిక్ రోషన్ అని చెప్పింది. శ్రద్ధాకి విహార యాత్రలు చేయడం బాగా ఇష్టమట


You may also like

Leave a Comment