“శ్యామ్ సింగ్ రాయ్” ట్రైలర్ లో ఈ సీన్స్ చూసారా..? పవన్ కళ్యాణ్ సినిమాలో సీన్స్ లాగా ఉన్నాయి ఏంటి..? ఏ సీన్లో ఓ లుక్ వేయండి.

“శ్యామ్ సింగ్ రాయ్” ట్రైలర్ లో ఈ సీన్స్ చూసారా..? పవన్ కళ్యాణ్ సినిమాలో సీన్స్ లాగా ఉన్నాయి ఏంటి..? ఏ సీన్లో ఓ లుక్ వేయండి.

by Anudeep

Ads

నాని హీరోగా రూపొందుతున్న “శ్యామ్ సింగరాయ్” సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో నానితో పాటు సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన థియేటర్లలో విడుదల అవ్వబోతోంది.

Video Advertisement

టాక్సీవాలా సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని శ్యామ్ సింగ రాయ్ గా, వాసుగా రెండు పాత్రల్లో నటించారు.

shyamsingaray 2

అయితే.. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల అయ్యి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా కోల్‌కతా నేపథ్యంలో సాగుతుంది. పునర్జన్మల నేపధ్యం ఈ సినిమా సాగుతుందని ప్రచారం జరుగుతోంది. మరో వైపు దేవ దాసీల అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారని తెలుస్తోంది.

shyamsingaray 3

ఇది ఇలా ఉంటె.. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. అయితే.. తాజాగా ఈ ట్రైలర్ లో కొన్ని సీన్స్ పవన్ కళ్యాణ్ “తీన్ మార్” సినిమాను పోలి ఉన్నాయి. దీనితో సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

shyamsingaray 1

తీన్ మార్ లో కృతి కర్బందా పాత్ర శ్యామ్ సింగరాయ్ ను పోలి ఉంటుంది. అలాగే పవన్, త్రిష సన్నివేశం లానే నాని, కృతి శెట్టిల సన్నివేశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ బైక్ పైనే వెళ్తున్న సీన్ లాగానే శ్యామ్ సింగరాయ్ లో నాని బైక్ తోలుతున్న సీన్ ఉంటుంది. ఈ సీన్ లు చూసి తీన్ మార్ లా ఉంది ఏంటి..? అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా తీన్ మార్ లా అవ్వకుంటే చాలు అంటూ కోరుకుంటున్నారు.

shyamsingaray 4


End of Article

You may also like