Ads
గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తరచుగా తన గళం వినిపిస్తూ ఉంటుంది. మహిళలని అవమానించేలా చిన్న సంఘటన జరిగినా చిన్మయి ఊరుకోవడం లేదు.
Video Advertisement
ప్రస్తుత సమాజంలో ఆడవారి డ్రస్సింగ్ పై అనేక విమర్శలు ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి మహిళల వస్త్రధారణపై విమర్శలు వెలుగులోకి వచ్చాయి. తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు సతీష్.. సన్నీలియోన్, దర్శగుప్తాల డ్రస్సింగ్ ను పోలుస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో ఈ వ్యాఖ్యలపై తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించింది సింగర్ చిన్మయి శ్రీపాద. మీలాంటి మగాళ్ల బుద్ధి ఇకనైనా మారాదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఇటీవల చెన్నైలో ‘ఓ మై ఘోస్ట్’ అనే చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ చిత్రంలో శృంగార తార సన్నీలియోన్, యువ నటి దర్శ గుప్తా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో నటుడు సతీష్ కూడా చిన్న పాత్రలో నటించాడు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సతీష్ మాట్లాడుతూ ..” సన్నీలియోన్ ఎక్కడో ముంబై నుంచి తమిళ చిత్ర పరిశ్రమకు వచ్చింది. మన సంస్కృతికి తగ్గట్లుగా ఆమె ఎంతో అందంగా బట్టలు వేసుకుంది. మరోవైపు మన కోయంబత్తూర్ పిల్ల దర్శ గుప్తాని చూడండి’ అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. సన్నీలియోన్ చీరకట్టులో మెరిసింది. దర్శ గుప్తా మాత్రం ఎక్స్ పోజింగ్ చేస్తూ మోడరన్ డ్రెస్ లో మెరిసింది. దీంతో ప్రీ రిలీజ్ వేడుకకి హాజరైన అభిమానులు ఈలలు కేకలు వేశారు. దర్శ గుప్తా ఈ కామెంట్స్ ని సరదాగానే తీసుకుని చిరునవ్వులు చిందించింది.
దీనిపై చిన్మయి ఈ విధంగా రాసుకొచ్చింది.”ఒక స్త్రీని లక్ష్యంగా చేసుకుని, ఆమె వేసుకున్న డ్రస్ పై విమర్శలు చేయడం ఏంటి? ఆ మాటలకు జనాలు పగలబడి నవ్వడం ఏంటి? ఇలా మహిళల డ్రస్ పై విమర్శలు చేసే ఇలాంటి మగాళ్ల ప్రవర్తన ఇంకెప్పుడు మారుతుందో? నవ్వడానికి ఇది సరదా మాటలు కాదు కదా” అంటూ చిన్మయి ఘాటుగా ట్వీట్ చేశారు.
End of Article