బిగ్ బాస్ షో సీజన్ ఫైవ్ కంటెస్టెంట్స్ నుండి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సిరి, షణ్ముఖ్ క్లోజ్ గా ఉండడం బిగ్ బాస్ ఫ్యాన్స్ కి ఏమాత్రం నచ్చడం లేదు. షణ్ముఖ దీప్తి సునైనా తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అదే విధంగా సిరికి శ్రీహాన్ కి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.

Video Advertisement

అయినప్పటికీ కూడా వీళ్ళు ఇంత క్లోజ్ గా ఉండడం నెగిటివిటీకి దారితీస్తోంది. సిరి వల్లే షణ్ముఖ సరిగా గేమ్ కూడా ఆడలేకపోతున్నాడు అని కొంత మంది నేటిజన్లు అంటున్నారు. అలానే సిరి తల్లి కూడా షణ్ముఖ, సిరి హగ్ చేసుకోవడం నచ్చలేదని అన్నారు. పైగా వీళ్ళ విషయంలో నాగార్జున కూడా ఏమీ అనలేదని నేటిజన్లు ట్రోల్ చేయడం కూడా జరిగింది.

అయితే తాజాగా శ్రీహాన్ ఇంస్టాగ్రామ్ లో స్పందించాడు. సిరి, షణ్ముఖ్ ఉంటున్న వాతావరణం అలాంటిది. సిరి వాళ్ళ అమ్మ ఏం చెప్పాలో తెలియక అలా అన్నారని శ్రీహాన్ అన్నాడు. ఎక్కువగా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చూసి ఆమె ఇలా స్పందించారు అంటూ శ్రీహాన్ చెప్పాడు. పైగా సిరి, షణ్ముఖ్ రిలేషన్ షిప్ ని నేను గౌరవిస్తున్నానని శ్రీహాన్ చెప్పాడు.