చిన్నప్పుడు అమ్మ మీద కోపంతో ప్రాణాల మీదకి తెచుకున్నారట.. సిరివెన్నెల ఆ పని చేసేసరికి..?

చిన్నప్పుడు అమ్మ మీద కోపంతో ప్రాణాల మీదకి తెచుకున్నారట.. సిరివెన్నెల ఆ పని చేసేసరికి..?

by Megha Varna

Ads

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎన్నో అద్భుతమైన పాటల్ని వ్రాసారు. అయితే ఒకానొక సమయంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆయన గురించి ఆయన చెప్పారు. ఆయన పాటలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఆయన ఈ విధంగా జవాబు ఇచ్చారు. నేను బలహీనమైన పాటలు రాసి ఉండొచ్చు కానీ చెడ్డ పాటలు మాత్రం రాయలేదు అన్నారు. నిజంగా ఆయన సాహిత్యంపై ఆయనకి ఎంతో గౌరవం ఉంది.

Video Advertisement

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి తండ్రి హోమియోపతి వైద్యులు. ఆయనకు 13 దేశ భాషలతో పాటు రెండు విదేశీ భాషలు కూడా తెలుసు. ఈయన ట్యూషన్లు చెప్పేవారు. ఆయన యొక్క పెద్ద కుమారుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి పదేళ్ల వయస్సు ఉన్నప్పుడు సంస్కృత భాషను నేర్చుకున్నారు.

అదే విధంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పుస్తకాలు చదవడం అంటే బాగా ఇష్టం. పుస్తకాలు చదవడం వల్ల సాహిత్యం పట్ల గొప్ప ప్రతిభ ఏర్పడింది. ఒకసారి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అందరి పిల్లల్లాగే తాను కూడా అల్లరి చేశారు. తల్లి మందలించే సరికి ఆయన తుంటరి పని చేసారు. దీని వలన చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లారు. రెండు రోజులు స్పృహ లేకుండా అలానే ఉన్నారు. ఎప్పుడు తను మాట్లాడుతారు అని అందరూ ఎదురు చూశారు. మూడోరోజు స్పృహలోకి వచ్చారు ఆయన. అప్పుడు తన తండ్రి ఒక మాట చెప్పారు అమ్మంటే కథలలో రాసి ఉన్నట్లుగా ఊహల్లో ఊహించుకోవద్దు అని అన్నారు.

అలానే అమ్మ కూడా మామూలు మనిషి అని చెప్పారు. ఆ తర్వాత సిరివెన్నెల గారు అమ్మతనం అంటే కనిపించేది వినిపించేది కాదు అని వ్రాసారు. అలానే అమ్మంటే ఎవరంటే చూపించే వీలుంటే ఆ వేలుకి తెలిసేనా అమ్మంటే అనే మాటలు కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు.


End of Article

You may also like