Ads
ప్రతి మనిషికి అన్ని శరీర అవయవాలు ఎంతో ముఖ్యమైనవి. వాటివలనే మనిషికి మనుగడ సాధ్యమవుతోంది. అయితే.. అన్ని ఉన్నా కవి కావాలంటే మాత్రం స్పందించే హృదయం ఉండాలి. అది అందరికి సాధ్యం కాదు. అందుకే కవులకి గుర్తింపు లభిస్తోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మాయి కూడా ఒక రచయిత్రి. అయితే ఆమెకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు.
Video Advertisement
అన్ని ఉన్నా.. పనులు చేసుకోవడానికి మనలో చాలా మంది బద్ధకిస్తూ ఉంటాం. కానీ తాను అలా కాదు. బద్ధకం ఒకటైతే.. మనకి వచ్చే ఇబ్బందులు ఒకవైపు.. అన్ని ఉన్నవాళ్ళకి వచ్చే కష్టాలని ఎదుర్కోవడం కష్టం గా ఉంది. మరి రెండు చేతులు లేకపోతె వారి పరిస్థితి అంతకంటే ఘోరం గా ఉంటుంది. ఈ అమ్మాయి పేరు బూర రాజేశ్వరి. ఆమెను బూర రాజేశ్వరి అనేకంటే సిరిసిల్ల రాజేశ్వరి అని అంటే బాగా గుర్తుపడతారు.
ఆమెకు పుట్టుక తోనే రెండు చేతులు లేవు. 15 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఆమె నడవలేకపోయింది. అలా అని ఆమె చింతిస్తూ కూర్చుండిపోలేదు. కాళ్లతోనే ఆమె రాయడం నేర్చుకుంది. అక్షరాలు నేర్చుకునేది.. పుస్తకాలూ చదివేది. అలా కవితలు రాయడం కూడా ప్రారంభించింది. ఆమె సిరిసిల్ల లో నివసించేది. సిరిసిల్ల అంటే నేతన్నలకు పుట్టినిల్లు లాంటిది.. అక్కడ, వారి మధ్యే పెరిగిన రాజేశ్వరి వారి కష్టాలనే తన కవితలుగా మలిచేది. కాళ్లతోనే పెయింటింగ్ వేయడం కూడా నేర్చుకుంది..
ఆమె రాసిన కవితల్లోంచి.. 800 ల కవితలను మహారాష్ట్ర బోర్డు తమ అకడమిక్ కరిక్యులం లో చేర్చింది. ఆమె గురించి తెలుసుకున్న కేటీఆర్ ఆమెను తెలంగాణ బోర్డు కు కూడా సిఫారసు చేసారు. ఆమె రాసిన కవితలను ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారు ప్రచురింప చేసారు. ప్రస్తుతం మహారాష్ట్ర బోర్డు అన్ని కాలేజీల్లోనూ ద్వితీయ భాష తెలుగు లో ఆమె కవితల్ని పాఠ్యాంశాలుగా చేర్చి బోధిస్తున్నారు. కేటీఆర్ కూడా.. ఆమె కవితలను తెలంగాణ బోర్డు కరిక్యులం లో కూడా చేర్చాలని.. ఆమె గురించి పాఠ్యాంశాల్లో పొందుపరచాలని ఆదేశాలు జారీ చేసారు.
End of Article