ఎన్నో కావ్యాత్మక పాటలకు ప్రాణం పోసిన సిరివెన్నెల గారి కలం ఇక ఆగిపోయింది అంటే నమ్మలేము. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన అక్షరం మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఆయన దూరం అయ్యారని.. ఆ అక్షరమే కన్నీరు కారుస్తోంది. సాహితీ ప్రపంచానికి మరో సిరివెన్నెల దొరకడం ఇక సాధ్యమేనా..?

Video Advertisement

సినీ ప్రపంచానికి ఆయన లోటు తీరనిది. ఆయన రాసిన ప్రతి పాట ఓ అద్భుతమే. ఆయన లేని సాహితి ప్రపంచం ఊహించుకోలేం. ఓ సినిమా ఈవెంట్ లో సిరివెన్నెల గారి గురించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ మాట అంటారు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు అని.. ఆయన రాసిన పాటలని చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది.

sirivennela seetharama sastry sons professions

సిరివెన్నెల గారి భార్య పేరు పద్మావతి. వారిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కొడుకు పేరు యోగేశ్వర్ శర్మ. యోగేశ్వర్ సంగీత దర్శకుడు. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కుదిరితే కప్పు కాఫీతో పాటు, రంగు, అలాగే ఇంకా కొన్ని సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు. వారి చిన్న కొడుకు రాజా కూడా నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించారు. ఫిదాలో వరుణ్ తేజ్ కి అన్నగా నటించారు రాజా.

sirivennela seetharama sastry sons professions

అలాగే ఎవడు సినిమాలో రామ్ చరణ్ కి ఫ్రెండ్ గా నటించారు. అందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రని పోషించారు రాజా. అలాగే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అజ్ఞాతవాసి, రణరంగం, భానుమతి అండ్ రామకృష్ణ, అంతరిక్షం, మిస్టర్ మజ్ను తో పాటు ఇంకా ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు రాజా. 2008 లో వచ్చిన కేక సినిమాతో రాజా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు.