Sita Ramam: థియేటర్‌లో హిట్..! మరి టీవీలో..?

Sita Ramam: థియేటర్‌లో హిట్..! మరి టీవీలో..?

by kavitha

Ads

Sita Ramam: హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ సీతారామం. ఈ మూవీలో రష్మిక మందన్న కూడా ముఖ్య పాత్రలో నటించింది. తాజాగా సీతారామం సినిమా టెలివిజన్ లో ప్రసారం అయ్యి, 9.6 రేటింగ్ సాధించింది.

Video Advertisement

సీతారామం మూవీ థియేటర్లలో విజయం సాధించి, ఓటీటీలోనూ విజయవంతంగా దూసుకుపోతుంది.  దుల్కర్ సల్మాన్ తనదైన శైలిలో నటిస్తూ, రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులను దోచుకున్నారు. తాజాగా దుల్కర్ ‘సీతారామం’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. హృద్యమైన ప్రేమకావ్యంగా రూపొందిన ఈ సినిమా సినీ ప్రియుల హృదయాలను హత్తుకుంది. ఈ సినిమాలో ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, మృణాల్‌ల నటన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యమైన పాత్రలోఅక్కినేని సుమంత్‌, రష్మికల నటనకు మంచి మార్కులు వచ్చాయి.హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని సి.అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై నిర్మించారు. విశాల్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందించారు. యుద్ధంతో రాసిన ప్రేమకథగా, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటుగా సిని ప్రముఖుల ప్రశంసలు పొందింది. ఇటీవల ఈ సినిమాని స్టార్ మా ఛానల్ లో ప్రసారం చేయగా దానికి 9.6 టిఆర్పి వచ్చింది. ఈమధ్య కాలంలో విడుదలై, హిట్ అందుకున్న పలు మూవీస్ కంటే కూడా ఇది ఎక్కువ.వెండితెర పై సూపర్ హిట్ అయిన సీతారామం ఇటు టెలివిజన్ ప్రేక్షకుల మనసు దోచుకుని, ఇక్కడ కూడా సత్తా చూపించింది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, హిందీ భాషలలో కూడా విడుదలై అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటీటీలో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. ఇక ఈ సినిమా కోసం మేకర్స్ 51 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పెట్టిన పెట్టుబడి తేవడమే కాకుండా 30 కోట్ల లాభాలను తెచ్చి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ వసూళ్ల పరంగా రూ.80 కోట్ల క్లబ్‌లో చేరింది.


End of Article

You may also like