Ads
‘సీతా రామం’.. ఒక సాధారణ చిత్రంగా ఏ అంచనాలు లేకుండా విడుదలైందీ అద్భుతం. మంచి కథని ఎంతో సున్నితంగా తెరపై ఆవిష్కరించిన హను రాఘవపూడిపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతమైన కథతో పాటు హను రాఘవపూడి టేకింగ్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. సీత పాత్రలో మృణాల్ ఠాకూర్, రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయారు.
Video Advertisement
అయితే ఈ చిత్ర కథ నిజం జరిగిందా అని కొందరు ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి వెనుక ఉన్న కథను చూద్దాం..
ఈ చిత్రం రెండు టైం లైన్స్ లో నడుస్తుంది. 1960 లో, 1984 సంవత్సరాలలో నడుస్తుంది. ఈ చిత్రం లో కొన్ని పాత్రలు రామాయణం ఆధారం గా రాసుకున్నారు. సీతకి, రామ్ లెటర్ ని చేర్చే పాత్రలలో రష్మిక, తరుణ్ భాస్కర్ నటించారు. ఈ చిత్రం లోని చాలా సన్నివేశాలు నిజ జీవితం లోనివి అని దర్శకుడు హను రాఘవపూడి వెల్లడించారు. 2007 లో ఒక లైబ్రరీ లో ఆయన ఒక పుస్తకం చదువుతుంటే అందుకో ఒక పాత ఉత్తరం కనిపించింది అట. ఒక తల్లి హాస్టల్ లో ఉన్న తన కుమారుడి కోసం ఆ లెటర్ రాసిందని.. దాని నుంచే తనకు ఈ కథ ఆలోచన వచ్చిందని దర్శకుడు గతం లో తెలిపారు.
అలాగే ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్ర కూడా..చరిత్రలోని ఒక వ్యక్తి ఆధారంగానే రాసుకున్నట్లు తెలుస్తోంది. చరిత్ర కారుల ప్రకారం 16 .వ శతాబ్దం లో ఢిల్లీ ని అక్బర్ పరిపాలించేవాడు. ఆయన దర్బారులో పని చేసే ఒక వ్యక్తి కుమార్తె పేరు మెహరున్నీసా. ఆమె కూడా అక్కడే పని చేస్తూ ఉండేది. అక్బర్ కుమారుడు సలీం ఆమెను చూసి ఇష్టపడతాడు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న అక్బర్ ఆమెను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు.
తర్వాత అక్బర్ కొడుకు సలీం జహంగీర్ రాజు అవుతాడు. అప్పుడు మెహరున్నీసా భర్తను చంపేసి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. జహంగీర్ మెహరున్నీసాకు పెట్టుకున్న పేర్లలో ఒకటే నూర్జహాన్. తర్వాత జహంగీర్ చెడువ్యసనాలకు బానిస కావడంతో నూర్జహాన్ రాజ్యాన్ని పరిపాలిస్తుంది. అప్పుడే తన పేరుతో నాణేలను కూడా ముద్రిస్తుంది ఆమె. 16 శతాబ్దం లోని ఈమె ఒక శక్తివంతమైన మహిళగా చరిత్రలో నిలిచింది.
End of Article