షూటింగ్ లో అందరం ఆకలితో ఉంటె.. బాలయ్యకి మాత్రమే భోజనం వచ్చింది.. సీనియర్ నటి కామెంట్స్!

షూటింగ్ లో అందరం ఆకలితో ఉంటె.. బాలయ్యకి మాత్రమే భోజనం వచ్చింది.. సీనియర్ నటి కామెంట్స్!

by Anudeep

Ads

సీనియర్ నటి శివపార్వతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అంతే కాదు ఆమె బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా కనిపించారు. వరుస సినిమాలు, సీరియల్స్ లో సందడి చేస్తున్న నటి శివ పార్వతి ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

Video Advertisement

ఈ సందర్భంగా ఆమె తన సినిమా జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహానటి సావిత్రిని గుర్తు చేసుకుంటూ.. ఆమె జీవితం తమకు గుణపాఠంగా ఉందని.. తమ జీవితాన్ని సరైన దారిలో పెట్టుకున్నానని చెప్పుకొచ్చారు.

sivaparvathi 1

సినీ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే ఎన్నో ప్రేమ లేఖలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అలాగే షూటింగ్స్ జరుగుతున్న సమయంలో కూడా ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు. ఓ సారి బాలకృష్ణ హీరోగా వచ్చిన “ఒక్క మగాడు” సినిమా షూటింగ్ కోసం ఓ టెంపుల్ లోపల సెట్ సిద్ధం చేసారని.. అక్కడ పాత చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లు చేసారని చెప్పుకొచ్చారు. అయితే షూటింగ్ చూడడం కోసం ఆ చుట్టూ పక్కల ఊళ్ళ వారు చాలా మందే అక్కడకి వచ్చారని చెప్పుకొచ్చారు. అయితే షూటింగ్ చూడడం కోసం వచ్చిన జనాల రద్దీ ఎక్కువ ఉండడంతో మేమంతా లోపలే ఇరుక్కుపోయామని చెప్పుకొచ్చారు.

sivaparvathi 2

అయితే.. మధ్యాహ్నం మూడు గంటలు అయినా మాకు భోజనం రాలేదని దాదాపు పది మంది ఆర్టిస్టుల వరకు ఆకలితో అలమటించామని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నిచ్చెన వేసుకుని గోడ దిగి భోజనం తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ కి ఒక్కరికే భోజనం వచ్చిందని, కానీ ఆయన తాను తినకుండా ఆ క్యారేజ్ నా చేతిలో పెట్టి అందరికి ఎలా సర్దుతారో సర్దాలి అమ్మ అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఆ అన్నంలోనే కూర కలిపేసి అందరికి తలో కప్ లో పెట్టుకుంటూ వచ్చామని చెప్పుకొచ్చారు. ఆ భోజనాన్ని బాలయ్య తానొక్కరే తినేయలేదని.. అందరికి పంచారని.. ఈ సంఘటన ఆయన మనసు ఎలాంటిదో చెప్తుందని ఎమోషనల్ అయ్యారు.

Watch Video:


End of Article

You may also like