ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యంగ్ హీరోయిన్ శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం స్కంద. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను భారీ లెవెల్ లో ప్రొడ్యూస్ చేశారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. బోయపాటి అభిమానులు ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే తీర ధియేటర్లో విడుదలయ్యాక అశలు అడియాసలు అయ్యాయి.

Video Advertisement

రామ్ పోతినేని మాస్ యాంగిల్ లో చూపిస్తూ బోయపాటి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. టీజర్లు పాటల వరకు బాగా ఆకట్టుకునే ఈ సినిమా ట్రైలర్ రాగానే నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. శ్రీ లీల రామ్ డాన్సులు ఆడియన్స్ను విపరీతంగా అలరించాయి.

Skanda Movie Heroine: Name, Remuneration Details

బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి బిజినెస్ కూడా బాగానే జరిగింది.అయితే బోయపాటి ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా ఈ సినిమా బోల్తా కొట్టిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. లాజిక్ లేని సీన్లు కారణంగా ట్రోల్స్ కి కూడా గురి అయింది. అయితే నిర్మాత చేత మాత్రం బోయపాటి భారీగా ఖర్చు పెట్టించారని టాక్ నడుస్తుంది. దియేట్రికల్ బిజినెస్ నష్టాల్లో ఉన్న కూడా డిజిటల్ రైట్స్ రూపంలో సినిమాకి భారీగానే ముట్టిందని అంటున్నారు.

అయితే ఈ సినిమాని అక్టోబర్ 27 నుండి ఓటీటీ లోకి రానున్నట్లు ప్రచారం చేశారు. తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది అని తెలిపారు. అనుకున్నట్లుగానే ఆమెకు ప్రచారం నిర్వహించారు. అయితే అంతలోనే స్కంద ఓటీటీ విడుదల వాయిదా పడింది. మరికొద్ది రోజుల తర్వాతే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం లోపు కొత్త తేదీని ప్రకటిస్తున్నట్లు హాట్ స్టార్ వెల్లడించింది.

 

Also Read:ఎక్కడ చూసినా ఒకటే మ్యూజిక్కు..!” అంటూ… విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ఐరనే వంచాలా ఏంటి డైలాగ్ పై 15 మీమ్స్..!