“స్కంద” మూవీలో ఈ సీన్ గమనించారా..? ఆ ఆన్సర్ కి ఏమైనా సంబంధం ఉందా..?

“స్కంద” మూవీలో ఈ సీన్ గమనించారా..? ఆ ఆన్సర్ కి ఏమైనా సంబంధం ఉందా..?

by Mounika Singaluri

Ads

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఎనర్జిటిక్ హీరో రామ్, శ్రీ లీల జంటగా నటించిన సినిమా స్కంద. విచిత్రం రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే  చిత్రం డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. బోయపాటి గత చిత్రం అఖండ సూపర్ హిట్ అవడంతో స్కంద కూడా ఆ రేంజ్ లోనే ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు.

Video Advertisement

అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బోయపాటి మరి సిల్లీగా స్కంద సినిమా చేసేసాడు. కొన్ని కొన్ని సీన్లలో అయితే రామ్ కు డూపుగా బోయపాటి నటించేసాడు అంటే అర్థమవుతుంది ఈ సినిమాని తను ఎలా తీశాడు అని.

skanda movie review

థియేటర్లలో ఫ్లాప్ గా మిగిలిన ఈ చిత్రం తాజాగా ఓటిటి లో రిలీజ్ అయింది. థియేటర్ లో టాక్ కి సంబంధం లేకుండా ఓటిటి లో మంచి వ్యూస్ సంపాదించుకుంటుంది. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్లు లాజిక్ గా అందకుండా ఉన్నాయి. ఆ సీన్లను ఇంటర్నెట్ లో బాగా ట్రోల్ చేస్తున్నారు. కొన్ని సీన్ లలో అయితే చనిపోయిన వ్యక్తి ఎడిటింగ్ మిస్టేక్ వల్ల మళ్ళీ కనిపించాడు. దాన్ని అయితే ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. ఏందిది బోయపాటి అంటూ గట్టిగా ఏసుకున్నారు. ఇప్పుడు మరో సీన్ ఫన్నీ ఎడిట్ లు విపరీతంగా ట్రోల్ కి గురవుతుంది. అదేంటంటే శ్రీ లీల హీరో ఫాదర్ నీ “మీ కొడుకుకి ఏమన్నా జరిగుంటే” అని అడుగుతుంది. దానికి సమాధానంగా అతను “కొడుకు అంటే కొరివి పెట్టేవాడు కాదు… పరువు నిలబెట్టేవాడు….అయాం ప్రౌడ్ అఫ్ మై సన్ ” అంటూ సమాధానం చెబుతాడు.

అక్కడ అడిగిన క్వశ్చన్ కి చెప్పిన సమాధానంకి సంబంధం లేదు. దీనికి ఫన్నీ వీడియోలు  చేసి నేను అడిగింది ఏంటి నువ్వు చెప్పింది ఏంటి అన్నట్టు చేస్తున్నారు. మహేష్ బాబు ఖలేజా సినిమాలో సీన్లు మధ్యలో మిక్స్ చేసి బోయపాటిని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఏదో ఎమోషన్ క్యారీ చేద్దామనుకుంటే అది మోషన్స్ పట్టుకున్న దానిల అయిందంటూ నవ్వుతున్నారు. బోయపాటి ఒక సినిమా హిట్టు కొడితే దాని తర్వాత సినిమా ఫట్ చేయడం ఆనవాయితి ఏమో….పాపం బోయపాటి ని నమ్ముకుని రామ్ బుక్కై పోయాడు.

 

Watch Video:

https://www.instagram.com/reel/CznSzJBJ6qv/?igshid=NjZiM2M3MzIxNA==

Also Read:బాలీవుడ్ నుండి వచ్చిన మరొక డబ్బింగ్ సినిమా… మన వాళ్లకి నచ్చిందా..? ఈ సినిమా చూశారా..?


End of Article

You may also like