ఇదేం ట్విస్ట్…”గోవిందుడు అందరివాడేలే”లో ఈ సీన్ ఎప్పుడు గమనించలేదు.!

ఇదేం ట్విస్ట్…”గోవిందుడు అందరివాడేలే”లో ఈ సీన్ ఎప్పుడు గమనించలేదు.!

by Mohana Priya

Ads

డైరెక్టర్ పని అంత సులభమైనది కాదు. ఒక సినిమా మాత్రమే కాదు ఆ సినిమా లో నటించిన వాళ్ళు, ఇంకా సినిమాకి పని చేసిన వాళ్ళ అందరి బాధ్యత డైరెక్టర్ మీద ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే ఆ డైరెక్టర్ ని ఎంత పొగుడుతారో, అదే సినిమా ఫ్లాప్ అయితే ఆ డైరెక్టర్ ని అంతే ట్రోల్ కూడా చేస్తారు. అందుకే చాలా మంది డైరెక్టర్లు కూడా వాళ్ళకి నచ్చిన విధంగా కాకుండా ప్రేక్షకుల టేస్ట్ కి తగ్గట్టు సినిమాలు తీస్తున్నారు. మనందరం చెప్పే హిట్ లేదా ఫ్లాప్ అనే రెండు మాటల మీద ఆ డైరెక్టర్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

Video Advertisement

అందుకే సినిమా డైరెక్ట్ చేసేటప్పుడు డైరెక్టర్ కి చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిలో కొంతమంది డైరెక్టర్లు చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతారు. అలా గోవిందుడు అందరివాడే సినిమా లో కూడా ఒక చిన్న లాజిక్ మిస్ అయిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పబోయేది కేవలం స్క్రీన్ పై కనిపించిన సీన్ల ఆధారంగా చెప్పేవి మాత్రమే. వివరాల్లోకి వెళితే.

రామ్ చరణ్ వాళ్ళ నాన్నకి, వాళ్ల తాతకి గొడవలు వచ్చి విడిపోతారు. తాత పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ వాళ్ళ కొడుకు ఆ పాత్ర పోషించిన రెహమాన్ కోసం ఎంతో కష్టపడి వాళ్ళు ఉండే ఊరిలో హాస్పిటల్ కట్టిస్తే, ప్రకాష్ రాజ్ వాళ్ళ కొడుకు విదేశాల్లో డాక్టర్ గా ఉంటాను అని అంటారు. సాధారణంగా కొన్ని నిర్మాణాలకి అవి ఏ సంవత్సరంలో అయితే నిర్మించారో, ఆ సంవత్సరం పేరు ఆ బిల్డింగ్ మీద రాసేవారు. అలా ప్రకాష్ రాజ్ నిర్మించిన హాస్పిటల్ మీద 1952 అని ఉంటుంది.

ఒకవేళ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ 1952 లో జరిగినట్లయితే, రామ్ చరణ్ 25 సంవత్సరాల తర్వాత తన తండ్రిని, తన తాత ని కలపడానికి వాళ్ళ ఊరికి వెళ్తారు. అంటే 1977లో అన్నమాట. కానీ మనకి మాత్రం ఈ జనరేషన్ లాగానే చూపిస్తారు.

నటీనటుల గెటప్స్, వాళ్ళు వాడే వస్తువులు, బ్యాక్ డ్రాప్, అన్నీ కూడా ఇప్పటికి తగ్గట్టే ఉంటాయి. లేదు. ఒకవేళ కథ ఇప్పుడు జరుగుతున్నట్టే చూపించారు అనుకుందాం. అలా అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి, రామ్ చరణ్ ఇండియా కి వచ్చే ఎపిసోడ్ కి మధ్య చాలా సంవత్సరాల గ్యాప్ వస్తుంది.

1952 నుండి 2014 వరకు అంటే నటీనటుల వయసు కూడా కొంచెం మారుతూ ఉండొచ్చు. మీరు ఇప్పటి వరకు ఇది గమనించకపోతే మళ్లీ సినిమా చూసినప్పుడు ఒకసారి ఈ సీన్ అబ్జర్వ్ చేయండి.


End of Article

You may also like