LONG HAIR: 7 అడుగుల పొడుగు జుట్టుతో గిన్నిస్ రికార్డుకెక్కిన ఈ 46 ఏళ్ల మహిళ ఎవరంటే.?

LONG HAIR: 7 అడుగుల పొడుగు జుట్టుతో గిన్నిస్ రికార్డుకెక్కిన ఈ 46 ఏళ్ల మహిళ ఎవరంటే.?

by Mounika Singaluri

Ads

నేటి తరంలో ఆడవాళ్ళకి పొడవైన జుట్టు, జుత్తులో నిండైన పూల దండ ఊహించడానికి కూడా కరువైపోయింది. చాలామంది ఆడవాళ్లు హెయిర్ కట్ ల తోని, బాబ్బ్డ్ హెయిర్ల తో దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది. అయితే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక మహిళ మాత్రం ట్రెండ్ కి విరుద్ధంగా అతి పొడవైన జుట్టుని కలిగి ఉండి ప్రపంచ రికార్డుని సాధించింది. ఇక అసలు విషయానికి వస్తే 46 సంవత్సరాల స్మిత శ్రీవాత్సవ 7 అడుగుల 9 అంగుళాల పొడవాటి జుట్టుని కలిగి ఉంది ఆమె 14 సంవత్సరాల వయసు నుంచి పెరుగుతుంది. స్మిత తల్లి ఆమె జుట్టుని పెంచడానికి ప్రోత్సహించింది.

Video Advertisement

1980లలో హిందీ నటీమణులు ధరించే ఐకానిక్ పొడవాటి కేశాలంకరణ నుంచి ప్రేరణ పొందిన శ్రీవాత్సవ తన పొడవాటి జుత్తిని పెంచడంలో అంకితభావాన్ని చూపించింది. అదే ఇప్పుడు రికార్డు పుస్తకాలలో ఆమెకి స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఈమె గిన్నిస్ రికార్డు సాధించిన తర్వాత భారతీయ సంస్కృతిలో దేవతలు సాంప్రదాయకంగా చాలా పొడవాటి జుట్టుని కలిగి ఉంటారు. మన సమాజంలో జుట్టు కత్తిరించటం ఆశుభం అని భావిస్తారు అందుకే మహిళలు జుట్టు పెంచేవారు పొడవాటి జుట్టు స్త్రీల అందాన్ని పెంచుతుంది అని చెప్పుకొచ్చింది.

అలాగే స్మిత వారానికి రెండుసార్లు తలకు స్నానం చేస్తుంది. తన తల వాషింగ్,డ్రైయింగ్, డెటాంగ్లింగ్ మరియు స్టైలింగు తో సహా మొత్తం ప్రక్రియ మూడు గంటలు పడుతుంది. కేవలం తల కడగడానికే 30 నుంచి 45 నిమిషాల గడువు పడుతుంది. నేను మంచం మీద నిలబడి విడదీయటానికి ఒక షీట్ వేస్తాను అని చెప్పుకొచ్చింది స్మిత. తను జుట్టుని ఆరుబయట ఆరేసినప్పుడు చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు.

 

ఇంత పొడవాటి జుట్టు ఉనికిని అర్థం చేసుకోవడం ప్రజలకు చాలా కష్టమని ఆమె పేర్కొంది. ప్రజలు నా దగ్గరికి వస్తారు నా జుత్తుని ముట్టుకుంటారు మరియు నాతో ఫోటోలు తీసుకోవటానికి ఇష్టపడతారు. నేను జుట్టుకి ఉపయోగించే ఉత్పత్తుల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు అంటూ ఆనందంగా చెప్పింది స్మిత. అలాగే దేవుడు నా ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు అంటూ వరల్డ్ రికార్డు టైటిల్ దక్కించుకోవడం పట్ల కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

https://www.instagram.com/p/C0dPS7qP2P3/?hl=en


End of Article

You may also like