ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి, ఇప్పుడు కూడా హీరోయిన్ తో పాటు ఎన్నో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు స్నేహ. స్నేహ అసలు పేరు సుహాసిని రాజా రత్నం నాయుడు. స్నేహ ముంబై లో పుట్టారు. స్నేహ పుట్టిన తర్వాత తన కుటుంబం మొత్తం షార్జా కి వెళ్లిపోయారు. తర్వాత తమిళనాడులోని పనృతి లో సెటిల్ అయ్యారు.

sneha recent pictures going viral

2000 సంవత్సరంలో ఒక మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు స్నేహ. ఆ తర్వాత అదే సంవత్సరంలో ఒక తమిళ్ సినిమా కూడా చేశారు. 2001లో వచ్చిన తొలివలపు సినిమా తెలుగు ఇండస్ట్రీలో స్నేహ మొదటి సినిమా. ఆ తర్వాత తెలుగులో ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, శ్రీరామదాసు, మహారధి, రాధాగోపాళం తో పాటు, తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. 2012లో స్నేహ నటుడు ప్రసన్న ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

2015 లో వారిద్దరికీ ఒక బాబు పుట్టాడు. బాబు పేరు విహాన్. కొంతకాలం క్రితం మళ్లీ విరామం తీసుకున్నారు స్నేహ. ఈ సంవత్సరం జనవరి 24 వ తేదీన స్నేహ కి పాప పుట్టింది. పాపకి ఆద్యంత అని పేరు పెట్టారు.  ఇదిలా ఉండగా స్నేహ భర్త ప్రసన్న ఆగస్ట్ 28 వ తేదీన తన 39 వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్నేహ కొన్ని ఫోటోలని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.sneha recent pictures going viral sneha recent pictures going viral sneha recent pictures going viral