తెలుగుతనం ఒట్టిపడేలా అందంగా ఉండే హీరోయిన్స్ స్నేహ. ఇప్పటివరకు స్నేహ అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఒక 15 ఏళ్ల క్రితం సినీ ఇండస్ట్రీలో స్నేహ హవా ఏ రేంజ్ లో ఉండేదో అప్పటి జనరేషన్ వాళ్లకు బాగా తెలుసు. ఆల్మోస్ట్ అందరి అగ్ర హీరోల సరసన నటించిన స్నేహ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పెళ్లి చేసుకొని తన కెరీర్ కు కొన్ని రోజులు దూరంగా ఉన్న స్నేహ తిరిగి ఇప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

Video Advertisement

అయితే ఒకప్పటి ఈ హీరోయిన్ ప్రస్తుతం అక్క, వదిన లాంటి పాత్రను పోషిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ కథానాయకుడుగా రాబోతున్న 68 వ మూవీలో స్నేహ నటించిన బోతోంది అని ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. కొడుకు క్యారెక్టర్ చేస్తున్న విజయ్ కు జంటగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా తండ్రి క్యారెక్టర్ చేస్తున్న విజయ్ కు జోడిగా స్నేహ నటించిబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో విశేషమేమిటి అనుకుంటున్నారా….. నిజానికి ఇదే విజయ్ హీరోగా 20 ఏళ్ల క్రితం విడుదలైన వశీకర మూవీలో స్నేహ అతనితో హీరోయిన్గా నటించింది. మరి ఇప్పుడు అతని తల్లి క్యారెక్టర్ లో కనిపించనుంది. అఫ్కోర్స్ తండ్రి క్యారెక్టర్ లో నటించేది కూడా విజయ్ అనుకోండి.. కానీ ఎంతైనా మెయిన్ హీరోయిన్ కాదు కదా. ఫిలిం ఇండస్ట్రీలో హీరోకి 60 ఏళ్ళు వచ్చిన హీరో గానే కొనసాగుతాడు…కానీ హీరోయిన్ ఎంత అందంగా ఉన్నా సరే సపోర్టింగ్ రోజుకి పరిమితం కావాల్సిందే.

అయితే మొదట ఈ క్యారెక్టర్ కోసం జ్యోతికను అనుకున్నారట. ఆమె కాదు అని చెప్పడంతో సిమ్రాన్ తో కూడా చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. మొత్తానికి ఏమైందో ఏమో ఇప్పుడు మాత్రం ఈ క్యారెక్టర్ కోసం స్నేహ పేరు వినిపిస్తోంది. ఇంతకీ స్నేహ ఈ ఆఫర్ ఒప్పుకుంటుందా లేదా…అనే విషయంపై ఎవరికి స్పష్టత లేదు. ఇక విజయ్ నటించిన తాజా చిత్రం లియో త్వరలో విడుదల కానుంది. విజయ్ తదుపరి 68వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లండన్ లో జరుగుతోంది. అది పూర్తయిన వెంటనే సినిమా షూటింగ్ మొదలవుతుంది.