బిగ్ బాస్ సీజన్ ఫోర్ ద్వారా మన అందరికీ చేరువయ్యారు సయ్యద్ సోహెల్ రయాన్. షో కి ఎంటర్ అయినప్పుడు చాలా కోపంగా ఉండేవారు. తర్వాత హోస్ట్ కింగ్ నాగార్జున చెప్పడంతో రానురాను మెల్లగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నారు సోహెల్. తన హ్యూమర్ తో, ఆడే విధానంతో, హౌస్ మేట్స్ తో కూడా స్నేహంగా ఉంటూ ప్రేక్షకుల మెప్పు పొందారు. అలా టాప్ థర్డ్ కంటెస్టెంట్ గా నిలిచారు సోహెల్.

bigg boss sohel movies

హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే తన తదుపరి సినిమాని కూడా ప్రకటించారు. బిగ్ బాస్ లో అడుగు పెట్టినప్పుడు తాను అంతకు ముందే కొన్ని సినిమాలు చేశాను అని చెప్పారు సోహెల్. యురేకా, కోనాపురంలో జరిగిన కథ అనే సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించారు సోహెల్. కానీ అంతకు ముందు కూడా మనం బాగా చూసిన కొన్ని సినిమాల్లో సోహెల్ ఉన్నారు.

అందులో ఒకటి వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో, హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన కొత్త బంగారు లోకం.  కొత్త బంగారు లోకం సినిమాలో హీరో చదువుకోడానికి హాస్టల్ కి వెళ్తాడు. అక్కడ హీరో స్నేహితులలో ఒకరిగా కనిపిస్తారు సోహెల్.

bigg boss sohel movies

ఇంకొకటి జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ సినిమాలో హీరో, హీరోయిన్లు కలిసి ఒక టూర్ కి వెళ్తారు. ఆ టూర్ లో వాళ్లతో పాటు ఇంకొంత మంది స్నేహితులు కూడా వెళ్తారు. వారిలో సోహెల్ ఉంటారు. తర్వాత కృష్ణవేణి అనే సీరియల్ లో నటించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు సోహెల్. మొదటి రెండు మూడు ఎపిసోడ్ల వరకు అరియానా ఇంకా సోహెల్ సీక్రెట్ రూమ్ లో ఉన్నారు.

తర్వాత హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. బిగ్ బాస్ ఫినాలేలో తనకి వచ్చిన మొత్తంలో కొంత మొత్తాన్ని ఆశ్రమానికి ఇవ్వాలని అనుకుంటున్నట్టు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవిని “తన సినిమాకి మద్దతు ఇవ్వగలరా?” అని అడిగారు సోహెల్. అందుకు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఇవ్వడానికి సిద్ధం అని చెప్పారు చిరంజీవి. అలాగే బ్రహ్మనందం గారు కూడా రెమ్యూనరేషన్ లేకుండా సోహెల్ సినిమాలో నటించడానికి సిద్ధం అని చెప్పారట.

bigg boss sohel movies

ప్రస్తుతం సోహెల్ హీరోగా మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. జార్జ్ రెడ్డి సినిమా నిర్మించిన అప్పి రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చిత్రబృందం అనుకుంటున్నారు.