“కుర్చీ మడత పెట్టి” పాట లాగానే… ముందు “ట్రోల్” అయ్యి తర్వాత రికార్డ్ సృష్టించిన 14 తెలుగు పాటలు..!

“కుర్చీ మడత పెట్టి” పాట లాగానే… ముందు “ట్రోల్” అయ్యి తర్వాత రికార్డ్ సృష్టించిన 14 తెలుగు పాటలు..!

by Harika

Ads

సినిమాకు ‘సంగీతం సగం బలం’ అంటారు మన పెద్దలు. పాటలు బాగుంటే సినిమాలు కూడా బాగానే ఉంటాయనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. కొన్ని సినిమాలను పాటల కోసమే చూస్తారు ప్రేక్షకులు. అలాగే పాటలు హిట్ కాకపోతే సినిమా ఫలితం ఆశించినంతగా ఉండదన్న విషయం తెలిసిందే. దీంతో పాటలపై, సింగెర్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు మేకర్స్.

Video Advertisement

చిత్ర రిలీజ్ కి ముందు నుంచే పాటల టీజర్లు అంటూ ఆడియన్స్ లో హైప్ పెంచుతుంటారు. అయితే కొన్ని పాటలు మాత్రం రిలీజ్ అయినప్పుడు యావరేజ్ గా అనిపించి.. ఫైనల్ గా మాత్రం సూపర్ హిట్స్ అవుతాయి. అలాంటి పాటలేవో ఇప్పడు చూద్దాం..

#1 ఊ అంటావా మావ..

సుకుమార్ దర్శకత్వం లో అల్లుఅర్జున్ నటించిన చిత్రం పుష్ప. ఇందులో సమంత ఒక ప్రత్యేక గీతం లో నటించింది. దీంతో ఈ పాటకి చాలా హైప్ వచ్చేసింది. కానీ ఈ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. విపరీతం గా ట్రోల్స్ వచ్చాయి. కానీ ఫైనల్ గా సూపర్ హిట్ గా నిలిచింది.

#2 బాస్ పార్టీ

మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా.. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రం నుంచి ‘బాస్ పార్టీ’ ప్రోమో వదిలారు. ఈ పాటకు దేవి శ్రీ ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు లిరిక్స్ రాశారు. అయితే ప్రోమో రాగానే నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ స్టార్ట్ చేసారు. అయితే ఫుల్ సాంగ్ రిలీజ్ కాగానే అందరి నోళ్లు మూతబడ్డాయి. ప్రస్తుతం ‘బాస్ పార్టీ’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

#3 అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘ఖైదీ నంబర్ 150’. దాదాపు 10 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత డాన్సింగ్‌లో అదే జోరును చూపించారు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటతో మరోసారి బాక్సాఫీస్‌ను కుమ్మి పడేసారు చిరంజీవి. అయితే మొదట ఈ పాట రిలీజ్ అయినపుడు అసలు ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. కానీ కట్ చేస్తే పాట్లతో పాటు మూవీ సూపర్ హిట్ అయ్యింది.

#4 శివాజీ మూవీ సాంగ్స్

ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన శివాజీ మూవీ లో సాంగ్స్ అన్నీ.. చాలా స్లో గా .. అవుట్ ఆఫ్ రజని స్టైల్ లో ఉంటాయి. కానీ ఇప్పటికీ ఆ పాటలు సూపర్ హిట్టే..

#5 మైండ్ బ్లాక్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేష్‌ గతంలో ఎన్నడూ చేయనంత మాస్‌ సాంగ్‌ను ఆడియన్స్‌కు చూపించాలని అనిల్ ట్రై చేసి ‘మైండ్ బ్లాక్’ సాంగ్ చేసారు. అయితే దీనిపై ఆడియన్స్ నిరుత్సాహం వ్యక్తం చేసారు. ఇదేం సాంగ్ అంటూ.. దేవి శ్రీ ప్రసాద్ పై విరుచుకు పడ్డారు. కానీ ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

#6 సామి సామి..
పుష్ప లో వచ్చిన మరో సూపర్ హిట్ పాట సామి సామి.. అయితే ఈ సాంగ్ పై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. దేవి శ్రీ ప్రసాద్ వేరే సాంగ్స్ నుంచి ట్యూన్స్ కాపీ చేశాడంటూ నెటిజన్లు ట్రోల్ చేసారు.

 

#7 పైసా వసూల్..

ఈ వయసులో కూడా ఏ మాత్రం ఎనర్జీ తగ్గకుండా పైసా వసూల్ సాంగ్ కి డాన్స్ చేశారు బాలయ్య. అయితే ఈ సాంగ్ పై చాలా ట్రోల్స్ వచ్చాయి కానీ సూపర్ హిట్ అయ్యింది.

#8 నాథ్ నాథ్..

బద్రీనాథ్ సినిమాలోని నాథ్ నాథ్ పాటపై కూడా మొదట్లో చాలా ట్రోల్స్ వచ్చాయి.. కానీ అల్లు అర్జున్, తమన్నాల గ్రేస్ డాన్స్ తో సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

#9 అరబిక్ కుతూ..

బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతూ సాంగ్ ఎంత సూపర్ హిట్టో చెప్పక్కర్లేదు. అయితే ఈ సాంగ్ లిరిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. అవి కాస్తా తెలుగులోకి వచ్చేసరికి చాలా ట్రోలింగ్ జరిగింది.

#10 కిలిమంజారో
రోబో సినిమాలో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన పాట కిలి మంజారో.. అయితే ఈ పాట లిరిక్స్ పై చాలా ట్రోల్స్ వచ్చాయి కానీ.. ఈ పాట ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్.

#11 బ్లాక్ బస్టర్..
సరైనోడు సినిమాలోని మాస్ సాంగ్ బ్లాక్ బస్టర్. ఈ సాంగ్ కొరియోగ్రఫీ పై అప్పట్లో చాలా ట్రోల్స్ వచ్చాయి కానీ ఇది సూపర్ హిట్ అయ్యింది.

#12 మహేశా..
మహేష్ ని మరో సారి మాస్ అప్పీల్ లో చూపించిన సాంగ్ మహేశా..సర్కారు వారి పాటలోని ఈ పాట పై కూడా మొదట్లో నెగటివ్ ట్రోల్స్ వచ్చినా.. సూపర్ హిట్ అయ్యింది.

#13 ఇనుములో హృదయం..

రోబో సినిమాలోని మరో పాట ఇది. దీనిలో లిరిక్స్ వెరైటీ గా ఉన్నాయంటూ ట్రోల్స్ చేసారు కానీ హిట్ అయ్యింది ఈ సాంగ్..

#14. కుర్చీ మడత పెట్టి

మహేష్ బాబు శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన “గుంటూరు కారం” లో కుర్చీ మడత పెట్టే సాంగ్ విడుదలైనప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి. కానీ సంక్రాంతి పండగ సంబరాల్లో ఇదే పాట ఎక్కువ వినపడింది. ఎంతో మంది ఈ పాటకు రీల్స్ చేస్తూ ఉన్నారు. సరికొత్త రికార్డు సృష్టించింది ఈ పాట. ఈ పాటకు 1 మిలియన్ పైగా రీల్స్ చేశారంట.

 


End of Article

You may also like