Home Human angle సోనియా గాంధీ-రాజీవ్ గాంధీ పెళ్లి పత్రిక చూశారా..? ఏం రాసి ఉందంటే..?

సోనియా గాంధీ-రాజీవ్ గాంధీ పెళ్లి పత్రిక చూశారా..? ఏం రాసి ఉందంటే..?

by Sainath Gopi

భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు ప్రేమించుకునే తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే.

అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ వీరి పెళ్లిని అత్యంత ఘనంగా జరిపించారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రాజీవ్ గాంధీ సోనియా గాంధీ పెళ్లి పత్రిక వైరల్ అవుతుంది.

sonia gandhi and rajiv gandhi

ఇందిరా గాంధీ రాసినట్లుగా ఆ పెళ్లి పత్రికలో ముద్రించారు. ఫిబ్రవరి 26 1968వ సంవత్సరంలో సోనియా రాజీవ్ గాంధీ ల వివాహం జరుగుతుంది అని ముద్రించారు. ఇది వివాహం న్యూఢిల్లీలోని హైదరాబాద్ భవనంలో అత్యంత వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లికి మీతో పాటు ఎటువంటి గిఫ్ట్ లు తీసుకురావద్దంటూ ప్రత్యేకించి రాశారు. దేశ ప్రధాని కుమారుడు పెళ్లి అంటే ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.

sonia gandhi and rajiv gandhi

మదన్ మోహన్ ఉపాధ్యాయ అనే వ్యక్తి పేరు మీద రాసిన పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సోనియా రాజీవ్ గాంధీ లకు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు పిల్లలు ఉన్నారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు కూడా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున చురుకుగా వ్యవహరిస్తున్నారు. సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించక పోయిన ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతున్నారు

You may also like