“కాజల్, రకుల్” లాగానే… టాలీవుడ్‌లో “హిట్” అయ్యి… బాలీవుడ్‌లో ఫ్లాప్ అయిన 9 హీరోయిన్స్..!

“కాజల్, రకుల్” లాగానే… టాలీవుడ్‌లో “హిట్” అయ్యి… బాలీవుడ్‌లో ఫ్లాప్ అయిన 9 హీరోయిన్స్..!

by kavitha

Ads

సినీ ఇండస్ట్రీలో హీరోలతో కంటే హీరోయిన్ల కెరీర్ తక్కువ కాలమే కొనసాగుతుంది. ఈ క్రమంలోనే భాషలతో పనిలేకుండా వరుసగా మూవీస్ చేసుకుంటూ వెళ్తుంటారు.

Video Advertisement

ఇక సౌత్ లో విజయం పొందిన చాలా మంది హీరోయిన్స్ బాలీవుడ్ లోనూ పాగా వేయాలని ప్రయత్నించారు. కానీ వారు ఆశించిన స్థాయిలో నార్త్ లో రాణించలేకపోయారు. అలాంటి హీరోయిన్స్ ఎవరో చూదాం..

#1 హన్సిక మోత్వాని

హన్సిక కోయి మిల్ గయా సినిమాతో బాలనటిగా అందరి హృదయాలను గెలుచుకుంది. ఆ తరువాత హీరోయిన్ గా మొదటి సినిమా ‘ఆప్ కా సురూర్’తో వచ్చింది. బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. అయితే ఆ తరువాత సౌత్‌లో హీరోయిన్ గా సక్సెస్ అందుకుంది.#2 కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్ సౌత్ లో సీనియర్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఆమె 2004లో బాలీవుడ్ సినిమాలో ఒక చిన్న పాత్రతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తరువాత ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్, వెనక్కి తిరిగి చూడలేదు.  ‘సింగం’ మూవీతో మరోసారి బాలీవుడ్ లో వెళ్ళినా, అక్కడ సక్సెస్ కాలేకపోయింది.#3 భూమికా చావ్లా

భూమికా చావ్లా ‘తేరే నామ్’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్ ప్లేస్ కి వెళ్లలేక పోయింది. కానీ టాలీవుడ్ పరిశ్రమలో అవకాశాలు రావడంతో టాప్ హీరోయిన్ అయ్యింది. అంతేకాక ఆమె ఉత్తమ టాలీవుడ్ హీరోయిన్స్ లో ఒకరిగా ప్రశంసించబడింది.#4 త్రిష కృష్ణన్

దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగిన త్రిష. ‘జోడి’ సినిమాలో ఒక చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి తమిళ – తెలుగు ఇండస్ట్రీలలో గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ‘కట్టా మీఠా’ అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఆ తరువాత ఎప్పుడు బాలీవుడ్ వైపు చూడలేదు.

#5 రకుల్ ప్రీత్ సింగ్

గత కొంత కాలం నుండి రకుల్ వరుసగా హిందీలోనే సినిమాలు చేస్తున్నారు. కానీ ఏ ఒక్క సినిమా కూడా హిందీలో హిట్ అవ్వలేదు. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కానీ అందులో ఉన్న హీరోలకి పేరు వచ్చింది కానీ రకుల్ కి పెద్దగా పేరు రాలేదు.

#6 తమన్నా భాటియా

మిల్కీ బ్యూటీ ఓ హిందీ మూవీతోనే కెరీర్ మొదలుపెట్టింది. ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇప్పటికి కూడా వరుస ఆఫర్స్ అందుకుంటూ వెళ్తోంది. కాగా బాలీవుడ్ లో మాత్రం తమన్నా విజయం సాధించలేకపోయింది.#7 శ్రియా శరన్

శ్రియా శరన్ ‘ఇష్టం’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో అగ్రనటులందరితో నటించి రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. సౌత్ లో ఆఫర్స్ అందుకున్న శ్రియా ‘తుజే మేరీ కసమ్’ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. కానీ ఈ పరిశ్రమలో పెద్దగా రాణించలేకపోయింది.#8 అసిన్

కోలీవుడ్ క్వీన్ అని పిలిచే హీరోయిన్ అసిన్ కి అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయితో తెలుగులో గుర్తింపు పొందింది. ఆమెకు తమిళ మూవీ గజినితో స్టార్‌డమ్ పెరిగింది. ఆ తరువాత బాలీవుడ్ లో అమీర్ ఖాన్ రీమేక్ చేశారు. గజినీ సినిమాతో అసిన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఆమె బాలీవుడ్ లో అంతగా రాణించలేకపోయింది.#9 జెనీలియా డిసౌజా

ఆమె మొదటి సినిమా ‘జానే తూ యా జానే నా’ తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అది సూపర్ హిట్ అయ్యింది. అయినప్పటికీ, అక్కడ సక్సెస్ కాలేదు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారింది.


End of Article

You may also like