“స్పైడర్” లో విలన్ చిన్నప్పటి పాత్ర చేసిన అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడో చూసారా..?

“స్పైడర్” లో విలన్ చిన్నప్పటి పాత్ర చేసిన అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడో చూసారా..?

by kavitha

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘స్పైడర్’. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. 125 కోట్ల బడ్జెట్ తో మురుగదాస్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో  తెరకెక్కించాడు.

Video Advertisement

ఎస్.జె.సూర్య ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఆయన పాత్రకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. అయితే ఎస్.జె.సూర్య చిన్నప్పటి పాత్రలో సంజయ్ అనే అబ్బాయి నటించాడు. ఆ బాల నటుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో? ఏం చేస్తున్నాడో ఇప్పుడు చూద్దాం..
స్పైడర్ మూవీ అప్పట్లో భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు ధీటుగా విలన్ గా భైరవుడు అనే క్యారెక్టర్ లో ఎస్.జె సూర్య అద్భుతంగా నటించారు.
అతని నటనకు ప్రశంసలు వచ్చాయి. అయితే సూర్య చిన్నప్పటి పాత్రలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కూడా బాగా నటించాడు.
ఈ అబ్బాయి పేరు సంజయ్. శ్మశానంలో పుట్టి పెరిగిన అబ్బాయిగా చక్కటి నటనను ప్రదర్శించాడు. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత అతన్ని ‘స్పైడర్ సంజయ్’ అని పిలుస్తున్నారు. ఈ మూవీ తరువాత సంజయ్ పలు తమిళ సినిమాలలో నటించాడు. మాగముని, జాక్ పాట్, గజినీకాంత్, ఎచ్చరిక్కై తుగ్లక్, దర్బార్ వంటి సినిమాలలో నటించాడు.
సంజయ్ తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. అతనికి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఛానెల్ పేరు కుట్టి టాకీస్. ఇందులో తన సినిమాలకు సంబంధించిన విషయాలను, ఫుడ్ రివ్యూలను, డాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటాడు. సోషల్ మీడియాలోను సంజయ్ యాక్టివ్ గా ఉంటాడు. పాపులర్ సాంగ్స్ కు డాన్స్ చేసిన వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంటాడు.

https://www.instagram.com/p/Cn3Vqj1DPH8/

Also Read: MAHAVEERUDU REVIEW : “శివకార్తికేయన్” హీరోగా, రవితేజ వాయిస్ ఓవర్ తో వచ్చిన మహావీరుడు ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


You may also like

Leave a Comment