సీనియర్ ఎన్టీఆర్ కి ఎంత పేరు ఉందో మనకి తెలుసు. నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. సినిమా పరిశ్రమలో ఎదురులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పౌరాణిక పాత్రల తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్. నిజానికి అన్న గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వివాహం అనేది ఎంతో మధురమైనది.

Video Advertisement

పెళ్ళితో రెండు జీవితాలు మాత్రమే కాదు రెండు కుటుంబాలు కూడా ఒకటి అవుతాయి. అలానే పెళ్లి తర్వాత ప్రతి దానిలో కూడా మార్పు వస్తుంది. అయితే పెళ్ళికి ముందు అందర్నీ ఆహ్వానించడానికి ఆనవాయితీగా మనం లగ్న పత్రికలని పంపుతాము. లగ్న పత్రిక ఇచ్చి వివాహానికి ఆహ్వానిస్తాము.

తాజాగా ఆనాటి పెళ్లి పత్రిక ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆ శుభలేఖ ఎవరిదో కాదు. మన అన్న గారు ఎన్టీ రామారావు గారిది. ఎన్టీ రామారావు బసవతారకంల వివాహ ఆహ్వాన పత్రిక లో గ్రాంథిక భాష కనపడుతుంది. వీరి వివాహం కొమరవోలు అనే గ్రామంలో జరిగింది. ఈ పత్రికను గుడివాడ శ్రీ బాల సరస్వతి ప్రెస్ లో ముద్రించారు. ఎన్టీ రామారావు గారి వివాహం 22-4-1942 లో జరిగింది. 1985లో బసవతారకం గారు అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. అప్పుడు భార్య గుర్తుగా ఎన్ఠీఆర్ గారు క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.