Ads
సేవ చేసే ప్రతి సంస్థ మొదలైనప్పుడు చిన్న మొక్కలానే మొదలవుతుంది. నిదానం గా అంచెలంచెలుగా మహా వృక్షమవుతుంది. శ్రామిక్ మహిళా వికాస్ సంఘ్ కూడా అంతే. నిరాశ్రయులు, నిస్సహాయ స్థితి లో ఉన్న మహిళలకు రక్షణ కల్పించడం కోసమే ఈ సంస్థ మొదలైంది. మొదలైనప్పుడు ఈ సంస్థ కేవలం మూడు వేల రూపాయలతో మొదలైంది. ప్రస్తుతం, ఈ సంస్థ మూడు కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కు చేరుకొని ఎందరో అభాగ్యులకు ఆశ్రయమిస్తోంది.
Video Advertisement
వివరాల్లోకి వెళితే, ఈ సంస్థ 1991 లో ప్రారంభమైంది. ఇందుమతి బార్వే గారు ఈ సంస్థ ను ప్రారంభించారు. ఆమె వృత్తి రీత్యా టీచర్. వసాయ్ ప్రాంతం లో ఆమె నివసించేవారు. అక్కడే ఈ సంస్థ ను ప్రారంభించారు. మగదిక్కు లేని ఆడవారు, సంపాదన లేక, ఎటువంటి ఆధారం లేక సతమతమయ్యే ఆడవారిని ఈ సంస్థే చేరదీసి ఆశ్రయం కల్పిస్తుంది. వారికి వచ్చిన పని లో ప్రోత్సహిస్తుంది. వారు సొంతం గా కాళ్ళ మీద నిలబడే విధం గా సాయం అందిస్తుంది. ఇలా.. ఇప్పటి వరకు 300 ల మంది మహిళలకు ఈ సంస్థ ఆశ్రయమిచ్చింది.
ఆమె ఈ సంస్థ ప్రారంభించే సమయానికి ఆమె చేతిలో కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆమె స్నేహితులు సుభదా కొత్తవాలె, జయశ్రీ సామంత్, ఉష మనేరికర్ లు ఈ ట్రస్ట్ లో సభ్యులు గా ఉన్నారు. వీరందరి వృత్తులు వేర్వేరు. ఒకరు టీచర్ అయితే మరొకరు గృహిణి, మరొకరు సోషల్ వర్కర్ గా పని చేస్తున్నారు. ఈ నలుగురు తమ వద్ద ఉన్న డబ్బులను పోగు చేసుకుంటే మూడు వేలు గా తేలాయి. ఆ మొత్తం తోనే ఈ సంస్థను మొదలుపెట్టారు.
ఓ ఏడుగురు పేద మహిళలకు వీరు తొలుత ఆశ్రయమిచ్చారు. వారిచే వీరు రకరకాల వంటలు వండించి వర్కింగ్ బ్యాచిలర్స్ కు, ఆటో, రిక్షా డ్రైవర్లకు ఇవ్వడం ప్రారంభించారు. క్రమం గా వీరికి ఆదరణ పెరగడం తో సంస్థ బ్రాంచీలను కూడా ప్రారంభించింది. 2021 వచ్చేసరికి వీరికి ఆరు ఔట్లెట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ లో 175 మంది పనిచేస్తుండగా.. ఏడాదికి మూడు కోట్ల టర్న్ ఓవర్ తో నడిపిస్తున్నారు.
స్కూళ్ళు, కాలేజీ లు, ఆఫీసుల్లో వీరి ఔట్ లెట్స్ ఎక్కువ గా ఉన్నాయి. తక్కువ ధరకు నాణ్యమైన ఫుడ్ ను అందించడం వీరి ప్రత్యేకత. కేవలం లాభాల కోసం చూడకుండా.. నాణ్యతను మైంటైన్ చేస్తూ.. మహిళలకు ఆసరాగా నిలవడం వీరి లక్ష్యం. ఈ సంస్థ లో పనిచేసిన వారందరు లైఫ్ లో సెటిల్ అయిన వారే. అందరికి నెల నెలా టంచనుగా జీతాలు ఇచ్చేస్తారు. అన్నిటిని పక్కా గా ప్లాన్ చేస్తారు. అందుకే.. ఎందరో మహిళలు ఈ సంస్థలో పని చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. వీరి లక్ష్యం నెరవేరాలని కోరుకుందాం.
End of Article