Ads
డార్లింగ్ ప్రభాస్ కు “ఈశ్వర్” సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా హీరోయిన్ శ్రీదేవి విజయకుమార్ ను కూడా స్టార్ హీరోయిన్ ను చేసేసింది. శ్రీదేవి ప్రముఖ తమిళ నటులు విజయకుమార్ మరియు మంజుల విజయకుమార్ ల చిన్న కూతురు. ఆమె తెలుగు నాట కూడా పలు సినిమాలలో హీరోయిన్ గా, ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘రిక్షా మామా’ సినిమా తో ఆమె బాలనటిగా వెండితెరకు పరిచయం అయింది.
Video Advertisement
“ఈశ్వర్” సినిమా ఆమెకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తరువాత “నిన్నే ఇష్టపడ్డాను” , ” పెళ్లి కానీ ప్రసాద్”, “నిరీక్షణ”.. వంటి సినిమాలు చేసింది. ఆ తరువాత అకస్మాత్తు గా సినిమాల నుంచి సెలవు తీసుకుంది. 2009 వ సంవత్సరం లో ఆమె రాహుల్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని స్థిర పడిపోయింది. పెళ్లి చేసుకున్న తరువాత ఆమె సినిమాలకు దూరం గానే ఉంది. తమిళ్, తెలుగు లోనే కాకుండా కన్నడ సినిమాలలో కూడా నటించి పేరు తెచ్చుకున్న శ్రీదేవి విజయ్ కుమార్ పెళ్లి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసారు. వీర సినిమాలో రవితేజ కు చెల్లెలి గా కూడా ఆమె నటించారు.
అయితే, ప్రస్తుతం ఆమె సినిమాలు ఏమి ఒప్పుకోలేదు. పర్సనల్ లైఫ్ లో ఆమె చాలా ఆనందం గా ఉన్నారు. పెళ్లి తరువాత కొన్ని టివి షో లలో కనిపించిన శ్రీదేవి తాజాగా స్టార్ మా లో రాబోయే కామెడీ స్టార్స్ అనే టివి షో కి జడ్జి గా వ్యవహరించబోతున్నారని రూమర్లు వస్తున్నాయి. ఈ క్రమం లో ఆమె మళ్ళీ తెలుగువారి ముందుకు వచ్చే అవకాశాలుండొచ్చని తెలుస్తోంది.
వ్యాపారవేత్త రాహుల్ ను పెళ్లి చేసుకున్నాక శ్రీదేవి విజయ్ కుమార్ పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఆ పాప పేరు రూపిక. ప్రస్తుతం ఈ పాపకు ఐదేళ్లు. ఇటీవల ఆమె తన పాప ఫోటోలను నెట్టింట్లో పంచుకుంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి మరి.
Actress Sridevi Vijaykumar Rahul Daughter Rupikaa 3rd Birthday Stills
End of Article