ఆ పాటని షూట్ చేసేటప్పుడు నటి శ్రీదేవి కళ్ళుతిరిగి పడిపోయారా..?

ఆ పాటని షూట్ చేసేటప్పుడు నటి శ్రీదేవి కళ్ళుతిరిగి పడిపోయారా..?

by Megha Varna

Ads

నటి శ్రీ దేవి గురించి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన పనే లేదు. ఆమె తెలియని వాళ్ళు ఉండరు. ఈ నటి కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా అటు హిందీ, మలయాళం, తమిళ సినిమాల లో కూడా నటించి ఎంత గానో మెప్పించారు. పైగా ఎన్నో పురస్కారాలను కూడా శ్రీ దేవి అందుకున్నారు.

Video Advertisement

భారతీయ చలన చిత్ర రంగం లోనే బాల నటిగా ఎంట్రీ ఇచ్చి అగ్ర హీరోయిన్ గా చిన్న వయసు లోనే బాగా ఎదిగి పోయారు శ్రీ దేవి. ఈ అందాల తార ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించారు.

శ్రీ దేవి కి నాలుగేళ్ళ వయసున్నప్పుడు చిన్నారి అయ్యప్ప స్వామిగా వెండి తెర పై కనబడి ఆకట్టుకున్నారు. ఈ అతి లోక సుందరి గురించి ఆమె చేసిన సినిమాల గురించి నిజానికి ఎంత చెప్పినా తక్కువే. ఎం.జి.రామ చంద్రన్ శ్రీదేవి ని చూసినప్పుడు ఆమెకి అద్భుతమైన ఆఫర్ ని ఇచ్చారు.

షూటింగ్ సమయం లో శ్రీదేవిని చూసిన ఎమ్.జి.రామచంద్రన్ “నమ్ నాడు” అనే చిత్రంలో నటించేందుకు అవకాశం ఇవ్వగా.. ఆ చిత్రం అద్భుతమైన హిట్ ను అందుకున్నారు. తర్వాత ఆమెకు ఎన్నో అద్భుతమైన ఆఫర్లు వచ్చాయి. నిజానికి ఆ సినిమా తో శ్రీదేవి కెరియర్ మరో మలుపు తిరిగింది.

ఇక ఇదిలా ఉంటే శ్రీదేవి సినిమా ప్రయాణం లో ఒక సంఘటన జరిగింది. “చాల్ బాజ్” చిత్రం లో “నా జానే కహా సే ఆయా హై” పాట ని షూట్ చేసినప్పుడు శ్రీ దేవి కి జ్వరం ఎక్కువగా వచ్చింది. దానితో ఆమె మధ్య లో కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.


End of Article

You may also like