“ఆగడు” ప్లాప్ వెనక “శ్రీహరి” రోల్..? అలా చేసుంటే ప్లాప్ అయ్యేది కాదేమో?

“ఆగడు” ప్లాప్ వెనక “శ్రీహరి” రోల్..? అలా చేసుంటే ప్లాప్ అయ్యేది కాదేమో?

by Mohana Priya

Ads

ఒక డైరెక్టర్, ఒక హీరో మొదటి సారి కలిసి పని చేసిన సినిమా హిట్ అయితే వాళ్ళిద్దరి కాంబినేషన్ ని కూడా హిట్ కాంబినేషన్ అని అంటారు. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ శ్రీను వైట్ల కలిసి పనిచేసిన మొదటి సినిమా దూకుడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనే విషయం మనకి తెలిసిందే.

Video Advertisement

దూకుడు కి ముందు మహేష్ బాబు నటించిన రెండు సినిమాలు (అతిధి, ఖలేజా) ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దూకుడు సినిమా మహేష్ బాబు కి కం బ్యాక్ సినిమా. సంగీతం, డైలాగులు, నటుల పర్ఫామెన్స్, సినిమాటోగ్రఫీ ఇలా అన్నీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

దాంతో  తెలుగు ఇండస్ట్రీ లో వచ్చిన బెస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాల జాబితా లో దూకుడు సినిమా ఇప్పటికి కూడా ఉంటుంది. తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన మరొక సినిమా ఆగడు. శ్రీనువైట్ల పై ఉన్న నమ్మకంతో దాదాపు ఫస్ట్ హాఫ్ విని ఆగడు సినిమా ఓకే చేశారట మహేష్ బాబు.

హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆగడు సినిమా ఫస్ట్ సాంగ్ (టైటిల్ సాంగ్) కి వచ్చిన క్రేజ్ కూడా అంతా ఇంతా కాదు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆగడు సినిమా చిత్రీకరణ సమయంలో కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చాయట.

ముందు మహేష్ బాబు అన్నపాత్రకి రియల్ స్టార్ శ్రీహరి గారిని అనుకున్నారట.    శ్రీ హరి గారితో కొన్ని సన్నివేశాలు కూడా షూట్ చేశారట. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే శ్రీహరి గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. దాంతో శ్రీహరి గారి పై షూట్ చేసిన సీన్స్ అన్నిటినీ ట్రిమ్ చేశారట. శ్రీహరి గారి స్థానంలో అజయ్ ని తీసుకున్నారు.

ఇంకా విలన్ పాత్రలో ముందు ప్రకాష్ రాజ్ ని అనుకున్నారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రకాష్ రాజ్ ఈ సినిమా నుండి తప్పుకున్నారు.ఈ విషయంపై అప్పుడు కొంచెం చర్చ కూడా జరిగింది. తర్వాత ప్రకాష్ రాజ్ స్థానంలో సోనూసూద్ నటించారు.

ఆగడు సినిమాకి అనిల్ రావిపూడి రైటర్ గా పని చేశారు. ఈ సినిమాకి పని చేస్తున్న సమయంలోనే పటాస్ సినిమా ఆఫర్ రావడంతో ఆగడు సినిమా మధ్యలోనే తప్పుకున్నారట అనిల్ రావిపూడి. బహుశా ఒకవేళ ముందు అనుకున్న టీం తో సినిమా పూర్తయ్యి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో.


End of Article

You may also like