“మనుషులన్నాక తప్పులు చేస్తారు.!” అంటూ… షన్ను-దీప్తి “బ్రేకప్” పై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్..!

“మనుషులన్నాక తప్పులు చేస్తారు.!” అంటూ… షన్ను-దీప్తి “బ్రేకప్” పై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్..!

by Mohana Priya

Ads

గత కొన్ని రోజుల నుంచి కూడా దీప్తి సునైనా, షణ్ముఖ్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైనా తనని బ్లాక్ చేసింది అని కూడా చెప్పాడు. అయితే తాజాగా దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది.

Video Advertisement

అది ఇప్పుడు వైరల్ అవుతోంది. “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము” అని దీప్తి ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. “షణ్ముఖ్ మరియు నేను ఆలోచించి ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోవాలని అనుకుంటున్నాం” అని అంది.

bigg boss 5 telugu contestant shanmukh words about deepthi sunaina

“అయితే ఇప్పటి వరకు ఇద్దరు కలిసి ఉన్నాము. కానీ మా దారులు వేరు అని మేము తెలుసుకున్నాం” అని దీప్తి అంది. “అందుకే మేము విడిపోతున్నాం” అంటూ సోషల్ మీడియా ద్వారా దీప్తి సునైనా పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే, షన్ను, “తనకి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉంది” అని అన్నాడు. అలానే ఇప్పటి వరకు ఆమె చాలా చేసిందని, ఇప్పుడు ఆమె ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. ఇదిలా ఉండగా శ్రీ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియో ద్వారా ఈ విషయంపై శ్రీ రెడ్డి మాట్లాడారు.

sri reddy comments on deepthi shannu breakup

శ్రీ రెడ్డి మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు.  “మనుషులన్నాక తప్పులు చేస్తారు. దీప్తి మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అనిపించింది 5 సంవత్సరాలలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసాము, తట్టుకుని నిలబడ్డారు అని అన్నారు. బిగ్ బాస్ లో జరిగిన దానికి మీ ఇద్దరికీ బ్రేకప్ అయిందని చాలా క్లియర్ గా తెలుస్తోంది. దీప్తి నువ్వు కూడా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎంత క్లోజ్ గా ఒక పర్సన్ తో నీ రిలేషన్ షిప్ మెయింటైన్ చేసావో, అది ఆట కోసమో లేకపోతే ఇన్ సెక్యూర్ గా ఫీల్ అయ్యావో, లేకపోతే ఒక ఫ్రెండ్ గా అనుకొనో, నువ్వు కూడా, అంటే ఇదే లవ్ ఏమో అని జనాలకి అనుమానం వచ్చేలా నువ్వు కూడా బిహేవ్ చేసావు” అని ఈ జనరేషన్ వాళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు.

watch video :


End of Article

You may also like