“నాకు కూడా బాధ, డిప్రెషన్ ఉంది.!” అంటూ… ఎమోషనల్ అయిన బిగ్‌బాస్ సిరి బాయ్ ఫ్రెండ్..!

“నాకు కూడా బాధ, డిప్రెషన్ ఉంది.!” అంటూ… ఎమోషనల్ అయిన బిగ్‌బాస్ సిరి బాయ్ ఫ్రెండ్..!

by Mohana Priya

Ads

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి వారంలోకి ఎంటర్ అయింది. గత వారం జరిగిన ఎలిమినేషన్‌లో కాజల్ ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. ఫైనలిస్ట్ లుగా సన్నీ, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్ నిలిచారు. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఈ చివరి ఎపిసోడ్‌కి అతిధులుగా ప్రముఖ సెలబ్రిటీలు వస్తారని సమాచారం. ఎపిసోడ్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసారట.

Video Advertisement

ఇదిలా ఉండగా సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌కి వచ్చారు. ఇందులో సిరి గురించి, తన కష్టాల గురించి మాట్లాడారు శ్రీహన్. సమయం కథనం ప్రకారం, శ్రీహన్ మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. “ఇది చివరి వారం. కాబట్టి సిరికి గట్టిగా సపోర్ట్ ఇద్దాం. టాప్ 5 లో ఉండడానికి సిరి అర్హురాలు. వేరే వారితో పోల్చడంలాంటివి మనకి వద్దు. టాస్క్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఏవేవో జరుగుతూ ఉంటాయి.”

Also Read: Bigg Boss Telugu -5 : ఫైనల్స్ వరకు వచ్చి ఎలిమినేట్ అయిన “కాజల్” రెమ్యునరేషన్ ఎంతో తెలుసా…?

bigg boss telugu 5 siri boy friend srihan letter

“వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకరి మీద ఏదైనా నెగిటివ్ గా వస్తోంది అంటే, వారి స్థానంలో ఉండి ఆలోచిస్తేనే అసలు జరిగింది ఏంటో అర్థమవుతుంది. కానీ చాలా మంది జడ్జ్ చేసి ఏవేవో మాట్లాడుతున్నారు. అవన్నీ లైట్. పాజిటివ్ మైండ్ తో ఆలోచిద్దాం. నేను అలా ఉన్నా కాబట్టే నా పని నేను చేసుకోగలుగుతున్నాను. అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండాలి, పైకి రావాలి అని అనుకుంటాం. అమ్మాయిలకి సక్సెస్ అంత ఈజీగా రాదు. అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా కష్టపడాలి. సిరి చాలా కష్టపడి పైకి వచ్చింది. ఇంతవరకు వచ్చిన సిరిని మనం సపోర్ట్ చేద్దాం. తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకన్నా ఏం చెప్పలేను.”

srihan isntagram live about siri in bigg boss telugu 5

బిగ్ బాస్ హౌస్ లోకి నేను వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలో మైండ్ లో పెట్టుకుని వెళ్ళలేదు. ఆమెని పాజిటివ్ గా ఉంచాలి అనే ఉద్దేశంతోనే వెళ్లాను. అప్పటికే తాను చాలా డిప్రెషన్ లో ఉంది. దాని వల్ల గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకే తనని పాజిటివ్ గా ఉంచాలి అని అనుకున్నాను. అదే చేశా. సిరిని చూడంగానే చాలా ఏడుపు వచ్చింది. నేను ఏడిస్తే తను ఏడుస్తుంది అని నేను కంట్రోల్ చేసుకున్నా. నాకు కూడా బాధ డిప్రెషన్ ఉంది. నా మైండ్ కి నేను సమాధానం చెప్పుకున్నాను. వాళ్లు ఉన్న పరిస్థితిలో మనం ఉండి ఆలోచిస్తే బాధ తెలుస్తుంది” అని అన్నారు.

watch video :

https://youtu.be/6Es4VgtNXFU


End of Article

You may also like