సీనియర్ స్టార్ల “రికార్డ్” బ్రేక్ చేసిన… ఆ ఒక్క “శ్రీకాంత్” సినిమా ఏదో తెలుసా..?

సీనియర్ స్టార్ల “రికార్డ్” బ్రేక్ చేసిన… ఆ ఒక్క “శ్రీకాంత్” సినిమా ఏదో తెలుసా..?

by Sunku Sravan

కొన్ని సినిమాలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి భారీ హైప్ ని క్రియేట్ చేస్తాయి. సినిమాలో నటించే చిన్న హీరో హీరోయిన్లను చూసి చిన్న అంచనా వేయకూడదు.

Video Advertisement

అలా ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమాలు పెళ్లిసందడి, నువ్వే కావాలి. కేవలం మాటలతోనే జనాలను థియేటర్ వరకు రప్పించిన సినిమా పెళ్లి సందడి.

ఈ సినిమా విశేషాలు రికార్డ్స్ గురించి తెలుసుకుందాం. 1995లో రాఘవేంద్రరావు పెళ్లి సందడి అనే సినిమా తీశారు. చిన్న సినిమా అయినప్పటికీ కూడా మంచి క్వాలిటీతో ఉన్న గొప్ప టెక్నీషియన్స్ తో చేయాలి అనుకున్నారు. 80 లక్షల బడ్జెట్ నిర్ణయించుకున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ సినిమా అంటే అందరూ షాక్ అయ్యారు.

ఆ తర్వాత హీరోయిన్లుగా రవళి, దీప్తి పట్నాకర్ ను ఎంపిక చేశారు. ఇంతమంచి డైరెక్టర్ అయి ఉండి ఊరు పేరు లేని వాళ్ళతో సినిమా ఏంటి అని అందరూ అనుకున్నారు. సంగీత దర్శకునిగా కీరవాణిని ఎంచుకున్నారు. పెళ్లి సందడి సినిమాకి అయిన బడ్జెట్ 85 లక్షలు.1996 జనవరి 10న 60 థియేటర్స్ లో మాత్రమే విడుదలైంది పెళ్లి సందడి. సినిమా కథనం ఆకట్టుకుంది.

సినిమా అంత గ్లామర్ తో, పాటలతో కలర్ ఫుల్ గా ఉంది. పెళ్లి సందడి పెద్ద హీరోల సినిమా ల కాంపిటేషన్ మధ్య రిలీజ్ అయింది. ఎన్టీఆర్ లవకుశ సినిమా రికార్డును కూడా బద్దలుకొట్టింది పెళ్లి సందడి సినిమా. 98 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి, 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.


You may also like

Leave a Comment