“శ్రీనివాస రామానుజన్” కి ఇంగ్లండ్ వెళ్ళాక ఎదురైన ఈ సంఘటన గురించి తెలుసా..? ఆరోగ్యం పాడైపోతున్నా కూడా..?

“శ్రీనివాస రామానుజన్” కి ఇంగ్లండ్ వెళ్ళాక ఎదురైన ఈ సంఘటన గురించి తెలుసా..? ఆరోగ్యం పాడైపోతున్నా కూడా..?

by Megha Varna

Ads

శ్రీనివాస్ రామానుజన్ గురించి తెలియని వాళ్లు ఉండరు. శ్రీనివాస్ రామానుజన్ గొప్ప గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గణిత మేధావుల్లో ఈయన కూడా ఒకరు. శ్రీనివాస్ రామానుజన్ చేసిన పరిశోధనలు అప్పట్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి.

Video Advertisement

పట్టువిడవకుండా పరిశోధనలు చేశారు రామానుజన్. 1887 డిసెంబర్ 22న శ్రీనివాస్ రామానుజన్ జన్మించారు. 1920 ఏప్రిల్ 26 న మరణించారు.

శ్రీనివాస్ రామానుజన్ మరణించేటప్పటికి ఆయన వయస్సు కేవలం 33 మాత్రమే. కానీ అంత చిన్నవయసులో చనిపోవడం బాధాకరం. ఇదిలా ఉంటే ఈయన సాధించిన విజయాలకు గుర్తుగా తమిళనాడులో ఆయన జన్మించిన డిసెంబర్ 22ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అంతే కాక శ్రీనివాస్ రామానుజన్ 75వ పుట్టిన రోజు నాడు తపాలా బిళ్ళను విడుదల చేసారు.

దీనికి గల కారణం సంఖ్యా శాస్త్రంలో శ్రీనివాస రామానుజన్ చేసిన విశేష కృషే. అలానే అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయితే 2012లో రామానుజన్ బర్త్ డే ని జాతీయ గణిత దినోత్సవంగా మార్చారు. 125వ జయంతి కి అయితే భారత ప్రభుత్వం జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించడం జరిగింది.

ఓ సారి రామానుజన్ కి ఈ సంఘటన ఎదురైంది. అదేంటంటే.. ఇంగ్లాండ్ వెళ్లేముందు వాళ్ళ అమ్మగారు వెళ్లొద్దని ఆయనకి చెప్పారు. సముద్రం దాటి వెళ్లడం మంచిది కాదని సంస్కృతికి విరుద్ధమని చెప్పారట. పైగా ఇక్కడ ఏదో పని చేసుకుని ఉండిపొమ్మని ఆయనకి చెప్పారు. కానీ ఆయన వినలేదు.

ఆఖరికి తన మాటే నెగ్గించుకుని ఇంగ్లాండ్ వెళ్లి ప్రొఫెసర్ హార్డీ తో ఆయన యొక్క మేధస్సును ప్రపంచానికి చాటి చెప్పారు. కానీ కొన్ని సంవత్సరాలకి అనారోగ్యంతో మరణించారు. దీనికి గల కారణం ఏమిటంటే సంస్కృతి. ఇంగ్లాండ్లో శాఖాహారం దొరికేది కాదు. ఆచారం ప్రకారం రామానుజన్ మాంసాన్ని ముట్టకూడదు. మాంసం తినకుండా ఆరోగ్యం పాడైపోతున్నా సరే పస్తులు ఉన్నారు. ఏమాత్రం మాంసాహారం తినే వారు కాదు. శాఖాహారం చూస్తే దొరికేది కాదు. చావనైనా చచ్చిపోతాను కానీ మాంసాహారాన్ని తీసుకోనని రామానుజన్ అలానే అనుసరించి 33 ఏళ్లకే చనిపోయారు.


End of Article

You may also like