Ads
ఆహాలో వచ్చిన ఒక సినిమా గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. చాలా బాగుంది అంటూ పొగుడుతున్నారు. నలుగురు వ్యక్తుల జీవితాల మీద ఈ సినిమా నడుస్తుంది. గత నెల థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా పేరు శ్రీరంగనీతులు. పవన్ కుమార్ వి.ఎస్.ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాతగా వ్యవహరించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, అజయ్ అరసాడ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, శివ (సుహాస్) తన కాలనీలో ఎలాగైనా ఒక ఫ్లెక్సీ పెట్టించుకుని ఫేమస్ అయిపోదామని అనుకుంటాడు.
Video Advertisement
కానీ అనుకోకుండా ఫ్లెక్సీ కనిపించకుండా పోవడంతో మరొక ఫ్లెక్సీ చేయించుకుంటాడు. కార్తీక్ (కార్తీక్ రత్నం) కొన్ని సంఘటనల వల్ల చెడు అలవాట్లకు అలవాటు పడతాడు. కార్తీక్ తండ్రి కార్తీక్ ని ఆ అలవాట్లు మానిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వరుణ్ (విరాజ్ అశ్విన్), ఐశ్వర్య (రుహాని శర్మ) ప్రేమించుకుంటారు. కానీ ఐశ్వర్య తన ఇంట్లో తన ప్రేమని చెప్పడానికి భయపడుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళ జీవితాల్లో ఏం జరిగింది అనేది కథ. ముగ్గురి కథలు నడుస్తూ ఉంటాయి. వరుణ్, ఐశ్వర్య కథ తప్ప మిగిలిన ఎవరి కథలు అంత బాగా రాసుకున్నట్టు అనిపించదు. అసలు శివ ఫ్లెక్సీ పెట్టించుకుని గుర్తింపు తెచ్చుకుందామని ఎందుకు అనుకుంటాడు అనేదానికి సరైన కారణం ఉండదు.
కార్తీక్ అలా అవ్వడానికి కారణం ఏంటి అనే విషయాన్ని కూడా చెప్పలేదు. ఈ విషయాలు మీద ఇంకా ఫోకస్ చేసి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. సినిమా చూశాక చాలా ప్రశ్నలు వస్తాయి. కానీ సినిమా నుండి ఇచ్చిన సందేశం కూడా బాగుంది. కొన్ని విషయాల కోసం మనుషులు ఎలా తాపత్రయపడతారు అనే దాన్ని ఇందులో చూపించారు. గుర్తింపు, బాధనుండి బయటికి రాకపోవడం, సమాజంలో పెట్టిన కొన్ని నియమాలని పాటించడం ఇలాంటి విషయాలను చూపించారు. చివరిలో ఇచ్చే సందేశం కూడా బాగుంది. చివరికి ముగ్గురు తాము చేసిన తప్పులని ఎలా తెలుసుకున్నారు అనే విషయాలను చూపించిన విధానం కూడా బాగుంది. ముగ్గురు ఒకరికి ఒకరు తెలియదు. ముగ్గురి కథలు చూపించారు.
End of Article