సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. సాయికుమార్ అందరికీ సుపరిచితమే. చక్కటి డైలాగ్లతో అందరినీ బాగా ఆకట్టుకుంటారు సాయి కుమార్. సాయి కుమార్ లానే సాయి కుమార్ కుమారుడు కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే చాలా మందికి సాయి కుమార్ కూతురు గురించి తెలియదు.

Video Advertisement

సాయి కుమార్ కూతురు పేరు జ్యోతిర్మయి. ఈమె ఒక చిల్డ్రన్స్ డాక్టర్. గత సంవత్సరం కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ లో చిల్డ్రన్స్ క్లినిక్ ని మొదలు పెట్టారు. కేవలం ఏడాదిలోనే ఈమె చక్కటి పేరు ప్రఖ్యాతలని పొందారు.

నిజానికి ఈమె గురించి చాలా విషయాలు చెప్పేందుకు వున్నాయి. గత ఏడాది చిల్డ్రన్స్ క్లినిక్ ని ఈమె అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఎక్విప్‌మెంట్‌తో స్టార్ట్ చేసారు. అప్పటి నుండి కూడా ఈమె ఎంతో పేరుని సంపాదించుకున్నారు. చిన్న పిల్లలకి ఎలాంటి సమస్య వచ్చిన సరే ఈమె వుంది అనే ధైర్యాన్ని ఇచ్చారేమే. ఈమె చేసే సేవ గురించి చాలా మంది చిన్నారుల తల్లిదర్దులు వీడియో రూపం లో షేర్ చేయడం జరిగింది. చెరిష్‌ క్లీనిక్‌ను ప్రారంభించి ఏడాది లో దాదాపు 2500 మంది పిల్లలకి ట్రీట్మెంట్ ని అందించారు. నిజంగా ఇది ఎంతో గొప్ప విషయం.

పైగా ఈమె ట్రీట్మెంట్ చేయడమే కాకుండా పిల్లలకి అనారోగ్య సమస్యలు ఏమి కలగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలని కూడా తల్లిదండ్రులకి చెబుతూ వుంటారు.”నా చెరిష్‌ క్లీనిక్‌ను ప్రారంభించి ఈ ఏడదిలో దాదాపు 2500 మంది పిల్లలకి ట్రీట్మెంట్ ఇచ్చాను” అని ఆమె చెప్పారు. పైగా కొన్ని ఇంటి చిట్కాలను కూడా నేను తల్లిదండ్రులకి చెబుతూ వుంటాను అని ఆమె అన్నారు. పిల్లలకు ఇది హాస్పిటల్‌ అనే భావన లేకుండా ఉంచేందుకు క్లినిక్ ని ఇలా డిజైన్ చేసాము అని కూడా చెప్పారీమె. అన్ని రకాల అంతర్జాతీయ ప్రమాణాలను కూడా ఇక్కడ ఫాలో అవుతారట.