Ads
హీరోయిన్ ఎంగేజ్మెంట్ సీన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ తండ్రి ఫ్రెండ్ కొడుకైన మన హీరో కూడా హీరోయిన్ ఇంటికి వస్తాడు. అక్కడ అవుట్ హౌస్ లో ఉంటూ కామెడీ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఉద్యోగం వస్తుంది. ఇలా సాగుతుండగా అనుకోకుండా హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. కానీ తండ్రికి ఇచ్చిన మాటకోసం ఆ అమ్మాయిని ప్రేమించాలా? వద్దా? అనే కన్ఫ్యూషన్ లో పడతాడు మన హీరో.
Video Advertisement
ఈపాటికే మీకు అర్ధం అయిపోయి ఉంటుంది ఇంతసేపు మాట్లాడింది ఏ సినిమా గురించని. వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా ఎవర్ గ్రీన్ సినిమా అనే చెప్పాలి.
ఈ సినిమాని ఎన్ని సార్లు చూసినా ఏ మాత్రం బోర్ అనిపించదు. పైగా సినిమా మొత్తం మంచి కామెడీతో ఉంటుంది. విక్టరీ వెంకటేష్ యాక్షన్ తో పాటు కామెడీ కూడా చేసే కొద్ది మంది హీరోలలో ఒకరు. సరైన పాత్ర వచ్చిందంటే కామెడీ టైమింగ్ ని ఎవరు ఆపలేరు. వెంకటేష్ నటించిన సినిమాల్లో ఎన్నో సినిమాలు విజయవంతమయ్యాయి.
దేవి పుత్రుడు, ప్రేమతో రా.. వంటి సినిమాలు ప్లాప్ సినిమాలతో ఉన్న వెంకీ “నువ్వు నాకు నచ్చావ్” సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. అయితే.. అసలు ఈ సినిమాకి తొలుత వెంకటేష్ ను అనుకోలేదట. అప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ” నువ్వే కావాలి” సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన తరుణ్ ను ఈ సినిమా కోసం తొలుత సంప్రదించారట. అప్పట్లో ఈ సినిమా కొన్ని థియేటర్లలో సంవత్సరం పాటు ఆడి సంచలనం సృష్టించింది.
ఈ క్రమంలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా కోసం కూడా దర్శకుడు విజయ్ భాస్కర్ తరుణ్ ను సంప్రదించారట. అయితే.. అప్పటికే ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న తరుణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. దీనితో ఆ ప్లేస్ లో వెంకటేష్ ను తీసుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. ఈ సినిమా చేయలేకపోయినందుకు తరుణ్ చాలా బాధపడ్డారట. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన తరుణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
End of Article