Ads
‘నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాధ్’ ఈ డైలాగ్ మనకు పరిచయమయ్యి నేటికి 20 సంవత్సరాలు అవుతుంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం పూరి మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ గా స్టార్ డమ్ అందుకుంది మాత్రం బద్రి చిత్రంతోనే.పవన్ కళ్యాణ్ కెరియర్ లో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం బద్రి.
Video Advertisement
పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ ప్రేక్షకులకు అత్యంత దగ్గర అయింది కూడా ఈ చిత్రంతోనే.
ఏప్రిల్ 20 2000 సంవత్సరంలో బద్రి చిత్రం ‘విజయలక్ష్మి మూవీస్ బ్యానర్’ పై టి త్రివిక్రమ్ రావు నిర్మాణంలో విడుదల అయ్యింది.
ఈ చిత్రంతోనే పవన్ – రేణు దేశాయ్ లకు మధ్య పరిచయం ఏర్పడి ,ప్రేమగా మారి అది కాస్తా పెళ్లి వరకు వెళ్లడం జరిగింది .. పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్ , పూరి డైలాగ్స్ ,రమణ గోగుల బాణీలు ఈ చిత్రానికి మేజర్ హైలైట్స్ అని చెప్పాలి .అయితే ఈ చిత్రం వెనుక మనకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి. అసలు ఈ సినిమా కోసం హీరోగా ముందు పవన్ కళ్యాణ్ ను అనుకోలేదట.
పవన్ కంటే ముందుగా మరో స్టార్ హీరోను ఈ సినిమా కోసం తీసుకోవాలనుకున్నారట. సినిమా ఇండస్ట్రీలో ఇలా ఓ హీరో కోసం కథ రాసుకుని.. డేట్స్ అడ్జస్ట్ అవక మరో హీరోని తీసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. అలానే బద్రి సినిమా విషయంలో కూడా జరిగింది. ఈ సినిమా కథని నాగార్జున కోసం రాసుకున్నారట. అయితే ఆయన డేట్స్ ఇవ్వకపోవడంతో.. పూరి ఈ కథని పవన్ కళ్యాణ్ కు వినిపించారట. అయితే పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ ని మార్చాలని కోరారట. కానీ, పూరి ఒప్పుకోలేదు. చివరకు ఆయన కమిట్ మెంట్ పై నమ్మకంతో పవన్ ఈ సినిమా చేశారట.
End of Article