“ఫెవికాల్” వెనకున్న ఈ చరిత్ర మీకు తెలుసా.? అసలు ఎలా మొదలైంది అంటే.?

“ఫెవికాల్” వెనకున్న ఈ చరిత్ర మీకు తెలుసా.? అసలు ఎలా మొదలైంది అంటే.?

by Megha Varna

Ads

సాధారణంగా పేపర్ మరియు ఇతర మెటీరియల్స్ ను అతికించుకోవడానికి ఉపయోగించే గ్లూ బ్రాండ్స్ లో ఫెవికాల్ చాలా ప్రముఖమైనది. అయితే ఈ కంపెనీ యొక్క వ్యాపారం 1959 నుండి చాలా బాగా కొనసాగుతోంది. అయితే ఇదంతా రాత్రికి రాత్రి జరిగినదే కాదు. బల్వంత్ పరేఖ్ ఫెవికాల్ బ్రాండ్ ను స్థాపించారు.

Video Advertisement

ఆ ప్రయాణంలో ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొన్నారు. ఈ ప్రయాణం ప్రారంభించే ముందు ఈయన లాయర్ కావాలని అనుకున్నారు, అయితే ఆ సమయంలో మన దేశం స్వాతంత్రం కోసం పోరాడుతోంది.

దాంతో అందరి విద్యార్థులతో కలిసి స్వాతంత్రం కోసం పోరాడడం జరిగింది. తర్వాత ఎంతో కష్టపడి లాయర్ డిగ్రీ ను సంపాదించారు కానీ లాయర్ వృత్తి ని ఎంపిక చేసుకోలేదు. సరైన ఉద్యోగం లేకపోవడంతో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తరువాత స్వదేశీ ఉత్పత్తుల ప్రాముఖ్యత పెరిగింది దాంతో ఎన్నో ఇండస్ట్రీలు స్థాపించారు. కొన్ని సంవత్సరాల తర్వాత బల్వంత్ పరేఖ్ ఆయన సోదరుడుతో ఒక కెమికల్ ఇండస్ట్రీను ప్రారంభించారు.

ఈ విధంగా వ్యాపారాలు చేస్తున్న సమయంలో భారీగా ఉండేటువంటి చెక్కలను అతికించడానికి సరైనా గ్లూ లేకపోవడంతో కొంత పరిశోధన చేసి మన దేశానికి కొత్త ఉత్పత్తిని తీసుకు రావడానికి ఎంతో కృషి చేశారు. జర్మన్ కంపెనీ నుండి కొన్ని మెటీరియల్స్ ను కొనుగోలు చేసి ఫెవికాల్ అనే గ్లూ ను కనుగొన్నారు. ఈ ఉత్పత్తిని పిడిలైట్ ఇండస్ట్రీస్ లో మ్యానుఫ్యాక్చర్ చేసేవారు. అయితే అప్పుడు కేవలం ఫెవికాల్ ఉత్పత్తి మాత్రమే ఉండేది, తరువాత ఈ ఉత్పత్తి ఎంతో ఫేమస్ అవ్వడంతో ఈ కంపెనీ మోనోపోలీగా స్థిరపడింది.

ఆ తర్వాత ఇతర స్టేషనరీ, ఫుడ్, ఫ్యాబ్రిక్ కు సంబంధించిన మొదలైన మెటీరియల్స్ ను ఉత్పత్తి చేస్తోంది. ఈ విధంగా భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఉత్పత్తులు చేరాయి. 2013 లో పిడిలైట్ ఇండస్ట్రీస్ స్థాపకుడు పరేఖ్ చనిపోయాడు. మొదట ఒక్క ఆఫీస్ ని మొదలు పెట్టి దానిని విస్తరించుకుంటూ వెళ్లారు. యుఎస్, థాయిలాండ్, దుబాయ్, ఈజిప్ట్ మరియు బాంగ్లాదేశ్ లో కూడా ఈ కంపెనీ ఫ్యాక్టరీలు వున్నాయి.


End of Article

You may also like