Ads
80 లో పాపులరైన హీరోలలో సుమన్ ఒకరు. సుమన్ పూర్తి పేరు సుమన్ తల్వార్. 1979లో ఒక తమిళ సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలు పెట్టారు సుమన్. ఆ తర్వాత వరుసగా మూడు సంవత్సరాలు ఎన్నో తమిళ చిత్రాల్లో నటించారు. 1982లో ఇద్దరు కిలాడీలు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.
Video Advertisement
తమిళ సినిమాల్లో పాపులర్ అయిన సుమన్ తెలుగు సినిమాల్లో కూడా నటించారు. న్యాయం మీరే చెప్పాలి, దర్జా దొంగ, గర్జన, ధర్మపత్ని, పెద్దింటి అల్లుడు, పరువు ప్రతిష్ట, రెండిళ్ళ పూజారి, కొండపల్లి రాజా, బావ బావమరిది, అబ్బాయి గారి పెళ్లి ఇలా వరుసగా కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు.
1997లో వచ్చిన అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి గా నటించారు సుమన్. ఈ సినిమా సుమన్ ఎలాంటి పాత్రలో అయినా నటించగలరు అని నిరూపించింది. అప్పటి నుండి సుమన్ మెయిన్ లీడ్ గానే కాకుండా ముఖ్య పాత్రల్లో కూడా నటించడం మొదలు పెట్టారు. అయితే అన్నమయ్య సినిమాలో సుమన్ ను తీసుకోవడం కంటే ముందే చాలా కసరత్తులు జరిగాయట. ఆ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం తొలుత శోభన్ బాబుని సంప్రదించారట. అయితే.. అప్పటికే సినిమాలకు దూరంగా ఉంటున్నా అన్న కారణంతో ఆయన ఒప్పుకోలేదట.
అయితే మరీ మరీ అడిగేసరికి ఏకంగా యాభై లక్షల రెమ్యునరేషన్ అడిగారట. అయితే.. అంత పెట్టుకోలేక శోభన్ బాబుని వద్దు అనుకున్నారట. ఆ తరువాత ఈ పాత్ర కోసం బాలయ్యని సంప్రదించారట. అయితే బాలయ్య కూడా ఒప్పుకోలేదట. అయితే ప్రేక్షకుల నుంచి రిసీవింగ్ ఎలా ఉంటుందో అన్న అనుమానంతో బాలయ్య విషయంలో కూడా వెనక్కి తగ్గారట. ఆ టైం లో సుమన్ లీడ్ రోల్స్ పోషిస్తూ పాపులర్ అయ్యి ఉండడంతో ఆ పాత్ర కోసం సుమన్ ను తీసుకోవాలని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు భావించారట. అందుకోసం సుమన్ కు గెటప్ వేసి ఫోటో షూట్ కూడా చేశారట. అయితే ఈ సుమన్ బాగా సెట్ అవ్వడంతో ఆయనను సెలెక్ట్ చేసేసుకున్నారు.
End of Article